Akhanda-2: అఖండ-2 పై సాలిడ్ అప్‌డేట్.. రిలీజ్ ప్రోమోతో గూస్‌బంప్స్ పక్కా?
నట సింహం బాలకష్ణ (Balakashna)- యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’
దిశ, సినిమా: నట సింహం బాలకష్ణ (Balakashna)- యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ (Akhanda) ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సూపర్ హిట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్‌గా ‘అఖండ-2’ తెరకెక్కుతోంది. అంతే కాకుండా రీసెంట్‌గా ఈ మూవీని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. దీంతో.. ఈ మూవీ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ‘అఖండ-2’ (Akhanda-2) నుంచి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ రిలీజ్ డేట్ (Release Date) అనౌన్స్ చేస్తూ ప్రోమో విడుదల చేశారు. వచ్చే ఏడాది 2025 దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ రిలీజ్ ప్రమోలో.. సినిమా లాంచ్ టైంలో బాలయ్య బాబు చెప్పిన డైలాగ్‌ను చూపిస్తూ.. పవర్ ఫుల్ (Powerful) బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (Background Music)ను ప్లే చేశారు. దాంతో పాటు శివుడి తాండవం చేస్తున్నట్లు విజువల్స్‌ను గ్రాఫిక్స్ రూపంలో చూపించి మెప్పించారు. ప్రజెంట్ ఈ ప్రోమో బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకోవడంతో.. గూస్ బంప్స్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.