దిశ, సినిమా : బ్యూటిఫుల్ అదితి రావు హైదరి ఇండస్ట్రీలో వర్క్ ఎంజాయ్ చేసే విధానాన్ని వివరించింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించిన భామ.. తమిళ్ సినిమా సెట్స్‌కు వెళ్లినప్పుడు తెలుగు మాట్లాడటం, తెలుగు మూవీ సెట్లో తమిళ్ స్టార్ట్ చేయడం గందరగోళంగా ఉంటుందని చెప్పింది. ఏదేమైనా మణిరత్నం హీరోయిన్గా నిలిచిపోవాలనే డ్రీమ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపిన భామ.. ఇందుకోసం ముందుగా మణి సార్ మాతృభాషయిన తమిళ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లు వివరించింది. ఇక 2010లో సినిమాల్లో నటించేందుకు ముంబై వెళ్లిన తను.. ఆరేళ్ల తర్వాత 2016లో మణిరత్నం దర్శకత్వంలో సినిమా ఛాన్స్ అందుకున్న క్షణాన్ని జీవితంలో మరిచిపోలేనని చెప్పింది. ఇప్పటికే ఆయనతో రెండు సినిమాలు చేసిన అదితి.. ఈ క్రమంలో సంజయ్ లీలా భన్సాలీ, సుధీర్ మిశ్రా వంటి గొప్ప దర్శకులతో కలిసి పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది.