వావ్.. ఎన్టీఆర్ తెలుగుతో పాటు అన్ని భాషల్లో మాట్లాడతారా..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. తర్వాత అనేక హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Update: 2024-11-26 04:34 GMT

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. తర్వాత అనేక హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంలో కొమరం భీమ్‌గా నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్‌కు సరిసాటి ఎవరూ లేరు. డైలాగ్ డెలివరీ గాని, డాన్స్‌లో జోష్ గాని, ఫైట్స్‌లో ఎన్టీఆర్ స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అంత అద్భుతంగా ఉంటుంది ఎన్టీఆర్ నటన. ఇక రీసెంట్‌గా ‘దేవర’(Devara) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ‘వార్ 2’ మూవీలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌ కేవలం తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడుతారట. సాధారణంగా హీరోలు ఎక్కువగా ఇంగ్లీష్‌లో మాట్లాడడం చూస్తాము. పక్క రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్ చేసేటప్పుడు ఇతర హీరోలు ఇంగ్లీషులోనే మాట్లాడతారు. ఆర్ఆర్ఆర్ చిత్రం అన్ని భాషల్లో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. తారక్ ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ ఈవెంట్స్‌కి వెళ్ళినప్పుడు కర్ణాటకలో కన్నడ భాషలో మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అదేవిధంగా ముంబైలో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్‌లో అనర్గళంగా హిందీ, చెన్నైలో తమిళ్ మాట్లాడటం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తమ అభిమాన హీరో ఇన్ని భాషల్లో మాట్లాడటం చూసి ఫ్యాన్స్ సైతం తెగ సంబరపడిపోయారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

Tags:    

Similar News