‘నేను రాజకీయాలకు దూరంగా ఉంటా’.. నటి రేణూ దేశాయ్ షాకింగ్ కామెంట్స్!
సావిత్రి బాయి పూలే(Savitri Bai Phule) 194వ జయంతి (జనవరి 3) సందర్భంగా విజయవాడ(Vijayawada)లో ‘భారత చైతన్య యువజన పార్టీ’(BCY) ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సినీ నటి రేణూ దేశాయ్(Film actress Renu Desai) పాల్గొన్నారు
దిశ, వెబ్‌డెస్క్: సావిత్రి బాయి పూలే(Savitri Bai Phule) 194వ జయంతి (జనవరి 3) సందర్భంగా విజయవాడ(Vijayawada)లో ‘భారత చైతన్య యువజన పార్టీ’(BCY) ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సినీ నటి రేణూ దేశాయ్(Film actress Renu Desai) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని రేణూ దేశాయ్ అన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం అని చెబితే వచ్చాను. నేడు అందరి ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే అని చెప్పారు. పిల్లలు తల్లిదండ్రులు కంటే ఉపాధ్యాయులతోనే ఎక్కువ సమయం గడుపుతారు. కాబట్టి వాళ్లను సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది’’ అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం(Film actor Brahmanandam), బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ తదితరులు పాల్గొన్నారు.