'6 ఇయర్స్ కంప్లీట్, చాలా సంతోషంగా ఉంది'.. ప్రియుడితో జబర్దస్త్ యాక్టర్ బ్యూటిఫుల్ ఫొటో షూట్
ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షో ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్నారు.
దిశ, సినిమా: ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షో ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో ఫైమా ఒకరు. ఈమెకు తన కామెడీ టైమింగ్స్, పంచులకు తెలుగు ప్రేక్షకుల్లో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు జబర్దస్త్ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో బిజీ బిజీగా ఉంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. అక్కడ కూడా తనకంటూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నది. అయితే ఈ భామ అప్పట్లో తన కో కమెడియన్ పటాస్ ప్రవీణ్‌తో ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుందని పలు వార్తలు వచ్చాయి. కానీ, ఎవరూ ఊహించని విధంగా కొన్ని మంత్స్ క్రితం తన కొత్త బాయ్ ఫ్రెండ్‌ని పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చింది.
అయితే తన బాయ్ ఫ్రెండ్ పేరు కూడా ప్రవీణ్ కావడం విశేషం. ఇక అప్పటి నుంచి తన లవర్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఫైమా పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. తాజాగా ఫైమా తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన బాయ్ ఫ్రెండ్ అయిన ప్రవీణ్‌తో ఫొటో షూట్ చేసింది. అలాగే ‘6 ఇయర్స్ కంప్లీట్ అయింది. చాలా హ్యాపీగా ఉంది మై లవ్’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు వావ్ సూపర్, లైఫ్ లాంగ్ ఇలాగే కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నామంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు ఈ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.