కార్యకలాపాలను అనుమతించడంపై అప్రమత్తత అవసరం: సీఐఐ అధ్యక్షుడు

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి మూడో వేవ్‌పై వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అధ్యక్షుడు టి వి నరేంద్రన్ అన్నారు. సరఫరా వ్యవస్థను పునరుద్ధరించే కార్యకలాపాలపై మరింత జాగ్రత్తలు అవసరమని, దీనివల్ల ప్రజల జీవనోపాధి మెరుగుపడుతుందని, ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందని నరేంద్రన్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా అత్యవసరమైన కార్యకలాపాలకు మాత్రమే అనుమతివ్వాలని, ఆర్థిక కార్యకలాపాలు కీలకం కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సామాజిక కార్యక్రమాల నిర్వహణకు మరికొంత […]

Update: 2021-06-20 06:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి మూడో వేవ్‌పై వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అధ్యక్షుడు టి వి నరేంద్రన్ అన్నారు. సరఫరా వ్యవస్థను పునరుద్ధరించే కార్యకలాపాలపై మరింత జాగ్రత్తలు అవసరమని, దీనివల్ల ప్రజల జీవనోపాధి మెరుగుపడుతుందని, ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందని నరేంద్రన్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా అత్యవసరమైన కార్యకలాపాలకు మాత్రమే అనుమతివ్వాలని, ఆర్థిక కార్యకలాపాలు కీలకం కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

సామాజిక కార్యక్రమాల నిర్వహణకు మరికొంత సమయం వేచి ఉండాలన్నారు. మూడో వేవ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. సెకెండ్ వేవ్ సమయంలో ఆర్థికవ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, జీఎస్టీ వసూళ్లలో అది స్పష్టంగా తెలుస్తోందన్నారు. ప్రసుత ఏడాది చివరి నాటికి దేశంలోని వయోజనులందరికీ టీకా ఇచ్చేందుకు రోజుకు కనీసం 71 లక్షల కొవిడ్ టీకా పంపిణీ చేయాలని ఆయన సూచించారు. పెరుగుతున్న ఉక్కు ధరలపై ఎంఎస్ఎంఈ ఇంజనీరింగ్ రంగం నుంచి వినిపిస్తున్న ఆందోళనలపై స్పందించిన ఆయన.. ధరల పెరుగుదలను పరిశీలిస్తున్నామన్నారు. అదే సమయంలో భారత్‌లో ఉక్కు ధరలు ప్రపంచ ధరల కంటే చౌకగా ఉన్న సంగతి గుర్తించాలన్నారు.

Tags:    

Similar News