అమరావతి భూములపై సీఐడీ మూడంచెల వ్యూహం

దిశ, వెబ్ డెస్క్: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంపై సీఐడీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. విచారణలో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకేసారి మూడు వ్యూహాలతో కేసు కేసు విచారణ చేపడుతోంది. ఇప్పటికే ఈ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారాయణలకు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై చంద్రబాబు, నారాయణలు కోర్టులను ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో విచారణ జరుగుతున్న […]

Update: 2021-03-19 05:50 GMT

దిశ, వెబ్ డెస్క్: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంపై సీఐడీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. విచారణలో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకేసారి మూడు వ్యూహాలతో కేసు కేసు విచారణ చేపడుతోంది. ఇప్పటికే ఈ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారాయణలకు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై చంద్రబాబు, నారాయణలు కోర్టులను ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

కోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో సీఐడీ మరో రెండు వ్యూహాలను అమలు చేస్తోంది. దళితుల భూములను కారుచౌకగా కొనుగోలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో దళితుల నుంచి నేరుగా వివరాలు సేకరిస్తోంది. తాడేపల్లి పీఎస్‌లో దళిత రైతుల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మందడానికి చెందిన రైతుల నుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే వ్యవహారానికి సంబంధించి అధికారులను సైతం సీఐడీ విచారిస్తుంది. ఐఏఎస్ అధికారులు మెుదలకుని క్షేత్రస్థాయి ఉద్యోగుల వరకు విచారణ చేపట్టాలని సీఐడీ నిర్ణయించింది. వివాదాస్పదమైన జీవోల జారీ వ్యవహారంతోపాటు.. అధికారులపై ఎలాంటి ఒత్తిడులు వచ్చాయి అన్నదానిపై ఆరా తీస్తోంది.

అందులో భాగంగా ఐఏఎస్ అధికారి, సీఆర్డీఏ కమిషనర్ గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. తొలుత గుంటూరు జిల్లా జేసీగా.. ఆ తర్వాత సీఆర్డీఏ చైర్మన్ గా వ్యవహరించిన శ్రీధర్ పాత్రపై పూర్తి స్థాయి వివరాలు సేకరించే పనిలో పడింది సీఐడీ బృందం. విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సుమారు 3 గంటలపాటు విచారించారు. అసైన్డ్ భూములకు సంబంధించిన వ్యవహారాలపై పూర్తిస్థాయి ఆధారాలు సేకరిస్తున్నారు.

మరోవైపు వివాదాస్పద జీవో 41ను జారీ చేసిన అజైన్ జైన్‌ను కూడా విచారించే అవకాశం లేకపోలేదు. కేబినెట్ ఆమోదం లేకుండా అసైన్డ్ భూముల విషయంలో జీవో జారీ చేయడంపై వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తోంది. అధికారులపై నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి చేశారన్న కోణంలో కూడా విచారణ చేపట్టింది. గతంలో సీఆర్డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన నాగులాపల్లి శ్రీకాంత్ నుంచి కూడా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తోంది. సీఐడీ మూడంచెల వ్యూహంతో కేసు విచారణలో స్పీడ్ పెంచడంతో ఎవరి మెడకు ఉచ్చు చుట్టుకుంటుందనే ఆందోళన అధికారుల్లో మొదలైంది.

Tags:    

Similar News