ఏపీ ఫైబర్‌నెట్ కేసులో సీఐడీ దూకుడు
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. మంగళవారం నుంచి నిందితులను విచారించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న నాటి ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన సాంబశివరావు, టెరా సాఫ్ట్ ఎండీ గోపిచంద్‌లకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో నాటి ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొర్పొరేషన్ ఎండీ సాంబశివరావులు మంగళవారం సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆరోపణలపై సీఐడీ […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. మంగళవారం నుంచి నిందితులను విచారించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న నాటి ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన సాంబశివరావు, టెరా సాఫ్ట్ ఎండీ గోపిచంద్‌లకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో నాటి ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొర్పొరేషన్ ఎండీ సాంబశివరావులు మంగళవారం సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
ఆరోపణలపై సీఐడీ అధికారులు వీరిని విచారిస్తున్నారు. మెుత్తం ఈ కేసులో 19మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మొత్తం రూ. 321 కోట్ల ప్రాజెక్ట్‌లో రూ.121 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెరా సాఫ్ట్ కంపెనీకునిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని ఆరోపణల నేపథ్యంలో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.