బిచ్కుందలో అక్రమ మద్యం పట్టివేత
దిశ, నిజామాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిడమే కాకుండా అన్ని మద్యం షాపులు మూసి వేయించింది. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు ఎమ్మార్పీ ధరల కంటే అధిక రేట్లకు గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు ఆదివారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కుర్మా గంగాధర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా అతని ఇంట్లో సోదాలు […]
దిశ, నిజామాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిడమే కాకుండా అన్ని మద్యం షాపులు మూసి వేయించింది. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు ఎమ్మార్పీ ధరల కంటే అధిక రేట్లకు గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు ఆదివారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కుర్మా గంగాధర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా మహారాష్ట్రకు చెందిన దేశీదారు మద్యం బాటిళ్లు పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి. అలాగే ఆర్ఎంపీ రవి ఇంట్లో సోదాలు చేయగా రూ.6,030 విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేసినట్టు సీఐ సుధాకర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మీడియాతో మాట్లాడుతూ..కాసులకు కక్కుర్తి పడిన కొందరు వ్యక్తులు ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారని వివరించారు. ఇకమీదట ఎవరైనా దేశీదారు, మద్యం, సారా విక్రయాలు జరిపితే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపడుతామన్నారు.
tags : illegal wine sale, nizamabad, bichkunda, case file