చెరువును తలపిస్తోన్న చిట్యాల MRO ఆఫీస్
దిశ, చిట్యాల: గతకొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమలమై, కాలనీలు నీటమునిగాయి. ఇందులో భాగంగానే నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలోకి భారీగా వరదనీరు చేసిన సెల్లార్ విభాగం చెరువును తలపిస్తోంది. అయితే, ఇప్పటికే రాష్ట్రంలో డెంగీ ఫీవర్ విస్తృతంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో కార్యాలయంలో ఇంత జరుగుతున్నా.. సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆఫీసుకు వచ్చిన వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా.. దీనివల్ల భవిష్యత్తులో కార్యాలయ భవనానికి నష్టం జరిగే […]
దిశ, చిట్యాల: గతకొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమలమై, కాలనీలు నీటమునిగాయి. ఇందులో భాగంగానే నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలోకి భారీగా వరదనీరు చేసిన సెల్లార్ విభాగం చెరువును తలపిస్తోంది. అయితే, ఇప్పటికే రాష్ట్రంలో డెంగీ ఫీవర్ విస్తృతంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో కార్యాలయంలో ఇంత జరుగుతున్నా.. సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆఫీసుకు వచ్చిన వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా.. దీనివల్ల భవిష్యత్తులో కార్యాలయ భవనానికి నష్టం జరిగే అవకాశం లేకపోలేదని సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. వర్షపునీరు రోజుల తరబడి నిల్వ ఉండటం మూలంగా దోమలు చేరి డెంగీ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని సూచించారు.