సీఎం కేసీఆర్‌కు చిరు కృతజ్ఞతలు..

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా కుదేలైన సినిమా రంగంపై తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్ అందించడం, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు కనీస విద్యుత్ డిమాండ్ చార్జీలను రద్దు చేయడంతో పాటు షోలు పెంచేందుకు అనుమతి ఇవ్వడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో మాదిరిగా టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించడం మంచి […]

Update: 2020-11-23 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా కుదేలైన సినిమా రంగంపై తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్ అందించడం, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు కనీస విద్యుత్ డిమాండ్ చార్జీలను రద్దు చేయడంతో పాటు షోలు పెంచేందుకు అనుమతి ఇవ్వడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో మాదిరిగా టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించడం మంచి నిర్ణయమన్న చిరు.. ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి, దానిపై ఆధారపడిన లక్షలాది మంది కుటుంబాలకు ఇది తోడ్పాటుగా ఉంటుందని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో ఆయన విజన్‌కు తగినట్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుందని, దేశంలోనే తొలి స్థానం దక్కించుకుంటుందనే పూర్తి విశ్వాసంతో ఉన్నానని తెలిపారు చిరు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..