ఆచార్య సమ్మర్ రేస్‌లో లేనట్టే?
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కరోనా పాజిటివ్.. ఆచార్యకు నెగెటివ్ అయ్యే చాన్స్ ఉందా? లాక్డౌన్ తర్వాత, షూటింగ్ మొదలుపెట్టే టైమ్‌కే చిరుకు కరోనా రావడంతో షూటింగ్ మరోసారి వాయిదా పడిందా? చిరు లేకుండా సన్నివేశాల చిత్రీకరణ జరగడం లేదా? చిరుకు నెగటివ్ వచ్చాకే సినిమా షూటింగ్ ప్రారంభించాలని దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు నిర్ణయించారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. చిరు లేకుండానే ‘ఆచార్య’ చిత్రీకరణ ప్రారంభించాలని ముందుగా అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రెండు […]
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కరోనా పాజిటివ్.. ఆచార్యకు నెగెటివ్ అయ్యే చాన్స్ ఉందా? లాక్డౌన్ తర్వాత, షూటింగ్ మొదలుపెట్టే టైమ్‌కే చిరుకు కరోనా రావడంతో షూటింగ్ మరోసారి వాయిదా పడిందా? చిరు లేకుండా సన్నివేశాల చిత్రీకరణ జరగడం లేదా? చిరుకు నెగటివ్ వచ్చాకే సినిమా షూటింగ్ ప్రారంభించాలని దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు నిర్ణయించారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
చిరు లేకుండానే ‘ఆచార్య’ చిత్రీకరణ ప్రారంభించాలని ముందుగా అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రెండు నెలల తర్వాతే షూటింగ్ మొదలుపెట్టాలని ఫిల్మ్ మేకర్స్ డిసైడ్ అయినట్టు సమాచారం. దీంతో ముందుగా ప్రకటించిన ప్రకారం సమ్మర్‌కు మాస్ ఫుల్ మస్త్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం లేదట. అంటే ఆచార్య సమ్మర్ రేస్ నుంచి తప్పుకుని.. మరో రెండు నెలల తర్వాతే రిలీజ్ అయ్యే చాన్స్ ఉందని టాక్. అయినా ఎప్పుడైతే ఏముందిలే చిరు బాగుంటే చాలు అంటున్నారు ఫ్యాన్స్. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడ్డాకే షూటింగ్లో జాయిన్ కావాలని కోరుతున్నారు.
కాగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చిరుతో జోడీ కడుతుండగా.. రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.