నా ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు : చిరు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. ఆడపడుచుల పూల‌ సంబురం.. బతుకమ్మ పండుగ. ఈ పూల పండుగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు […]

Update: 2020-10-24 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. ఆడపడుచుల పూల‌ సంబురం.. బతుకమ్మ పండుగ. ఈ పూల పండుగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను.’ అని చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News