ఐదుగురు రెబల్స్‌పై చిరాగ్ వేటు
పాట్నా: బిహార్‌లో లోక్ జన శక్తి పార్టీ(ఎల్‌జేపీ)లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీపై అధికారాల కోసం రసవత్తర కుటుంబ రాజకీయానికి తెరలేసింది. చిరాగ్ పాశ్వాన్‌కు ఆయన బాబాయి పశుపతి కుమార్ పారస్‌కు మధ్య ఆధిపత్య పోరు రాజుకుంది. చిరాగ్ పార్టీ ఎంపీలు ఆయనపై తిరుగుబాటు చేసి పారస్‌ను పార్లమెంటరీ పక్ష నేతగా ఎన్నుకోగా, తాజాగా చిరాగ్ పాశ్వాన్‌పై రెబల్స్‌పై సస్పెన్షన్ వేటువేశారు. ఎల్‌జేపీని స్థాపించిన రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ పార్టీ చీఫ్‌గా ఉన్నారు. […]
పాట్నా: బిహార్‌లో లోక్ జన శక్తి పార్టీ(ఎల్‌జేపీ)లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీపై అధికారాల కోసం రసవత్తర కుటుంబ రాజకీయానికి తెరలేసింది. చిరాగ్ పాశ్వాన్‌కు ఆయన బాబాయి పశుపతి కుమార్ పారస్‌కు మధ్య ఆధిపత్య పోరు రాజుకుంది. చిరాగ్ పార్టీ ఎంపీలు ఆయనపై తిరుగుబాటు చేసి పారస్‌ను పార్లమెంటరీ పక్ష నేతగా ఎన్నుకోగా, తాజాగా చిరాగ్ పాశ్వాన్‌పై రెబల్స్‌పై సస్పెన్షన్ వేటువేశారు. ఎల్‌జేపీని స్థాపించిన రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ పార్టీ చీఫ్‌గా ఉన్నారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మట్టికరిచిన తర్వాత పార్టీలో అసంతృప్తరాగాలు ఊపందుకున్నాయి. గతవారం చివరిలో అనూహ్య మార్పులు సంభవించాయి. చిరాగ్ పాశ్వాన్‌పై పార్టీకి చెందిన మొత్తం ఆరుగురు ఎంపీల్లో ఐదుగురూ తిరుగుబాటు జెండా ఎగరేశారు.
పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా పారస్‌ను రెబల్ ఎంపీలు ఎన్నుకోగా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అందుకు ఆమోదాన్నీ తెలిపారు. . ‘ఒక నేతకు ఒక పదవి’ అనే సూత్రంతో చిరాగ్‌ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించామని రెబల్ ఎంపీలు పేర్కొన్నారు. ఎల్జేపీ జాతీయ అధ్యక్ష పదవి సహా ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్లమెంటరీ బోర్డ్ చైర్మన్‌గానూ చిరాగ్ కొనసాగుతున్నారు. ఎల్జేపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్, ఎన్నికల అధికారిగా సూరజ్ భాన్‌ను తిరుగుబాటు ఎంపీలు నియమించారు. పార్టీకి కొత్త చీఫ్‌ను ఎన్నుకోవడానికి ఐదు రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, చిరాగ్ పాశ్వాన్ వర్చువల్‌గా నేషనల్ ఎగ్జిక్యూటివ్స్‌లతో సమావేశం నిర్వహించారు. ఇందులో ఐదుగురు ఎంపీలు హాజరవ్వలేదు. వారికి నోటీసులు పంపినా సమాధానం ఇవ్వలేదు. ఇదే విషయాన్ని చెబుతూ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు పాశ్వాన్ తెలిపారు. పార్టీలోని పరిణామాలన్నీ వివరించడానికి బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మీడయా ముందుకు పాశ్వాన్ రాబోతున్నట్టు తెలిసింది.