ఏపీవ్యాప్తంగా పర్యటిస్తా : చినజీయర్ స్వామి

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాతసింగరాయ కొండ గ్రామంలో దక్షిణ సింహాచలంగాపేరుగాంచిన వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలోని ముఖద్వారంపై విగ్రహాలు ధ్వంసమయ్యయి. దీంతో ఏపీలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగడం పట్ల విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా దీనిపై చినజీయర్ స్వామి స్పందించారు. సింగరాయకొండ నరసింహస్వామి చేతుల ధ్వంసం జరుగడం శోచనీయం అన్నారు. ఆలయాల్లో రక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ద్రవాలు జరిగినప్పుడు తక్షణ […]

Update: 2021-01-05 05:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాతసింగరాయ కొండ గ్రామంలో దక్షిణ సింహాచలంగాపేరుగాంచిన వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలోని ముఖద్వారంపై విగ్రహాలు ధ్వంసమయ్యయి. దీంతో ఏపీలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగడం పట్ల విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా దీనిపై చినజీయర్ స్వామి స్పందించారు. సింగరాయకొండ నరసింహస్వామి చేతుల ధ్వంసం జరుగడం శోచనీయం అన్నారు. ఆలయాల్లో రక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ద్రవాలు జరిగినప్పుడు తక్షణ కర్తవ్యంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా ఈనెల 17న ఏపీవ్యాప్తంగా పర్యటిస్తానని అన్నారు. దాడులు జరిగిన ఆలయాలను సందర్శిస్తా, స్థానిక ప్రజలతో మాట్లాడుతానని వెల్లడించారు. ఆలయాల ఉనికికి భంగం వాటిల్లినప్పుడు మౌనం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికారు. ఇంటెలిజెన్స్ విభాగంతో స్పష్టమైన కమిటీ వేసి విచారణ జరపాలని కోరారు. ఏ మతానికి చెందిన ఆలయంపై దాడి జరిగినా తప్పే అని అన్నారు. ప్రార్థనామంతా స్పందించేదని తెలిపారు.

Tags:    

Similar News