ఆ విషయంలో జగన్ తీరు సరికాదు: చినరాజప్ప
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే గిరిజనులను అక్కడి నుంచి తరలిస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పుకొచ్చారు. బలవంతంగా తరలించే ప్రక్రియను జాతీయ ఎస్టీ కమిషన్ నిలదీసిందన్న విషయాన్ని గుర్తు […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే గిరిజనులను అక్కడి నుంచి తరలిస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పుకొచ్చారు. బలవంతంగా తరలించే ప్రక్రియను జాతీయ ఎస్టీ కమిషన్ నిలదీసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.