షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత మహిళల క్లీన్ స్వీప్
దిశ, స్పోర్ట్స్: ఢిల్లీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత షూట్లర్లు పూర్తి ఆధిపత్యం చెలయిస్తున్నారు. బుధవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఫైరింగ్‌లో భారత మహిళలు క్లీన్ స్వీప్ చేశారు. చింకీ యాదవ్ (23) తనకంటే సీనియర్లను ఓడించి స్వర్ణ పతకం గెలుచుకున్నది. సినీయర్ షూటర్ రాహి సర్నబోత్ (30)తో జరిగిన పోటీలో చెరి 32 పాయింట్లతో సమానంగా నిలిచారు. అయితే షూటౌట్‌లో చింకీ 4-3 తేడాతో రాహిని ఓడించి స్వర్ణం గెలిచింది. దీంతో […]
దిశ, స్పోర్ట్స్: ఢిల్లీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత షూట్లర్లు పూర్తి ఆధిపత్యం చెలయిస్తున్నారు. బుధవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఫైరింగ్‌లో భారత మహిళలు క్లీన్ స్వీప్ చేశారు. చింకీ యాదవ్ (23) తనకంటే సీనియర్లను ఓడించి స్వర్ణ పతకం గెలుచుకున్నది. సినీయర్ షూటర్ రాహి సర్నబోత్ (30)తో జరిగిన పోటీలో చెరి 32 పాయింట్లతో సమానంగా నిలిచారు.
అయితే షూటౌట్‌లో చింకీ 4-3 తేడాతో రాహిని ఓడించి స్వర్ణం గెలిచింది. దీంతో భారత్ ఖాతాలో మొత్తం 9 స్వర్ణాలు చేరాయి. రాహికి రజత పతకం, మరో షూటర్ మను బాకర్ కాంస్యం గెలుచుకున్నారు. వీరి ముగ్గురూ టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించారు. 2019లో దోహాలో జరిగిన ఆసియన్ చాంపియన్స్‌షిప్స్‌లో చింకీ యాదవ్ రెండో స్థానంలో నిలిచి ఒలంపిక్స్‌కు అర్హత సాధించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ పోటీల్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణం గెలుచుకున్నాడు. బుధవారం జరిగిన తుది సమయంలో తోమర్ 462.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. హంగేరీకి చెందిన ఇస్తావాన్ పెనీ 461.6 పాయింట్లు, డెన్మార్క్‌కు చెందిన స్టీఫెన్ ఓలెన్స్ 450.9 పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. తోమర్ ఇప్పటికే ఒలంపిక్స్ బెర్త్ సాధించాడు.