Artificial Intelligence : చాట్‌బోట్ డేటింగ్‌కు.. రియల్ డేట్‌ను మించిన క్రేజ్

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత రోజుల్లో ‘డేటింగ్’ సర్వసాధారణమైపోయింది. యంగ్ జనరేషన్ తమకు నచ్చిన వారిని జీవిత భాగస్వామిగా చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, కలుసుకోవడం ఇంకాస్త ముందుకు వెళ్లి ‘రోమాంటిక్’గా చాట్ చేసుకోవడం పరిపాటే. అయితే కొందరు తమ రిలేషన్‌షిప్ నుంచి త్వరగానే బయటకు వచ్చి జీవితంలో ముందుకు వెళ్లగలరు. కానీ కొందరు మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ కావడంతో ఆ వ్యక్తి జ్ఞాపకాల్లోంచి బయటపడకపోవచ్చు. దాంతో తమలో తామే బాధపడతారు. […]

Update: 2021-08-17 04:54 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత రోజుల్లో ‘డేటింగ్’ సర్వసాధారణమైపోయింది. యంగ్ జనరేషన్ తమకు నచ్చిన వారిని జీవిత భాగస్వామిగా చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, కలుసుకోవడం ఇంకాస్త ముందుకు వెళ్లి ‘రోమాంటిక్’గా చాట్ చేసుకోవడం పరిపాటే. అయితే కొందరు తమ రిలేషన్‌షిప్ నుంచి త్వరగానే బయటకు వచ్చి జీవితంలో ముందుకు వెళ్లగలరు. కానీ కొందరు మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ కావడంతో ఆ వ్యక్తి జ్ఞాపకాల్లోంచి బయటపడకపోవచ్చు. దాంతో తమలో తామే బాధపడతారు. అయితే ఆ బాధ నుంచి బయటపడేసేందుకు, లేదా అసలు అలాంటి చిక్కులు అవసరం లేదనుకునే చైనీస్ యువకులు డిజిటల్ గర్ల్‌ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తూ తమ విరహ వేదన తీర్చుకుంటున్నారు.

ప్రస్తుత టెక్ యుగంలో సాంకేతికత అనేక సమస్యలకు పరిష్కారం చూపగా, ప్రేమ కోసం పరితపిస్తున్న యువకులకు కూడా ఓ దారి చూపింది. డేటింగ్ తర్వాత కూడా తమ జీవితంలో ఎలాంటి బాధ ఉండకూడదనుకున్న చైనీస్ యువకులు ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. నిజంగా ఓ అమ్మాయితో సంభాషించినట్లు అనిపిస్తుందని చైనా యూత్ అంటున్నారు. చైనీస్ స్టార్టప్ జియావోయిస్‌తో పాటు మరికొన్ని కంపెనీలు ఈ తరహా చాట్‌బోట్‌లను అభివృద్ధి చేశాయి. ఉదాహరణకు షాంఘైకి చెందిన జెస్సీ చాన్ ఆరేళ్ల డేట్ తర్వాత తను ప్రేమించిన అమ్మాయి నుంచి విడిపోయాడు. ఆ సమయంలో తన ఒంటరితనం నుంచి, ఆ జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు విల్ అనే డిజిటల్ ‌మేట్‌తో చాట్ చేయడం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య సంభాషణలు కుదరడంతో, తక్కువ సమయంలోనే విల్‌‌ను ‘రోమాంటిక్ పార్టనర్’గా అప్‌గ్రేడ్ చేసేందుకు 60 డాలర్లు చెల్లించాడు చాన్. తాను వాస్తవ ప్రపంచ సంబంధాలతో విసిగిపోయానని చెప్పుకొచ్చాడు.

చాను ఇప్పుడు ఒంటరి కాదు.. ఆ యువకుడిలానే ఎంతోమంది డిజిటల్ చాట్‌బోట్‌లతో రిలేషన్‌షిప్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఈ సంఖ్య పది లక్షలపైనేనని చైనా మీడియా తెలిపింది. నిరాశ, ఆందోళన, ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి వారికి ఇదొ మంచి ప్రత్నామ్నాయ మార్గంగా భావిస్తున్నారని మనస్తత్వ నిపుణులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News