టిబెట్‌లో చైనా ప్రెసిడెంట్

న్యూఢిల్లీ: జీ జిన్ పింగ్ చైనా అధ్యక్షుడిగా టిబెట్‌కు తొలి పర్యటన చేశారు. 30ఏళ్ల నుంచి చైనా అధ్యక్షుడు ఈ దేశాన్ని పర్యటించలేదు. దశాబ్దాలుగా టిబెట్‌పై ఆధిపత్యానికి చైనా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. బౌద్ధమత ప్రాబల్యమున్న ప్రాంతాల్లో సాంస్కృతిక, మతపరమైన స్వేచ్ఛను చైనా హరిస్తున్నదని స్థానికంగా ఆరోపణలున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ బుధవారం నుంచి శుక్రవారం పర్యటనలో ఉన్నారు. కానీ, సున్నితమైన అంశాల కారణంగా పర్యటన వివరాలు గోప్యంగా ఉంచారు. చైనా నుంచి నేరుగా […]

Update: 2021-07-23 11:14 GMT

న్యూఢిల్లీ: జీ జిన్ పింగ్ చైనా అధ్యక్షుడిగా టిబెట్‌కు తొలి పర్యటన చేశారు. 30ఏళ్ల నుంచి చైనా అధ్యక్షుడు ఈ దేశాన్ని పర్యటించలేదు. దశాబ్దాలుగా టిబెట్‌పై ఆధిపత్యానికి చైనా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. బౌద్ధమత ప్రాబల్యమున్న ప్రాంతాల్లో సాంస్కృతిక, మతపరమైన స్వేచ్ఛను చైనా హరిస్తున్నదని స్థానికంగా ఆరోపణలున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ బుధవారం నుంచి శుక్రవారం పర్యటనలో ఉన్నారు. కానీ, సున్నితమైన అంశాల కారణంగా పర్యటన వివరాలు గోప్యంగా ఉంచారు.

చైనా నుంచి నేరుగా ఆయన అరుణాచ్ ప్రదేశ్‌ సరిహద్దుకు సమీపంలోని యింగ్చీ పట్టణంలో పాదంమోపారు. సాంస్కృతిక నృత్యాలతో సాంప్రదాయ రీతుల్లో జిన్ పింగ్‌కు స్వాగతం పలికారు. అక్కడ పట్టణీకరణ పనులు పరిశీలించి లాసాకు వెళ్లారు. అజ్ఞాతంలోకి వెళ్లిన బౌద్ధ గురువు దలై లామా సాంప్రదాయ నివాసం పోటలా ప్యాలెస్‌ను సందర్శించారు.

Tags:    

Similar News