రౌండ్ షేప్ తల కోసం చైనీయుల ఆరాటం!

దిశ, ఫీచర్స్ : ప్రతీ తల్లిదండ్రులు తమ బిడ్డ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ విషయంలో మరోఅడుగు ముందుకేసిన చైనీయులు.. న్యూ ట్రెండ్‌కు తెరలేపారు. చైనాలోని పేరెంట్స్ తమ పిల్లల తలలు గుండ్రంగా ఉండేలా హెల్మెట్స్ వంటి హెడ్-షేప్ కరెక్షన్ ప్రొడక్ట్స్ ధరించేలా చేస్తున్నారు. గుండ్రని తలలు చాలా అందంగా ఉంటాయని చైనీయులు భావిస్తారు. అలాంటి వారిని చూసి ముచ్చటపడటం వరకు బాగానే ఉంది. కానీ తమ బిడ్డకు ‘రౌండ్ హెడ్’ ఉండాలనే ఆశతో తీవ్రమైన […]

Update: 2021-11-07 07:28 GMT

దిశ, ఫీచర్స్ : ప్రతీ తల్లిదండ్రులు తమ బిడ్డ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ విషయంలో మరోఅడుగు ముందుకేసిన చైనీయులు.. న్యూ ట్రెండ్‌కు తెరలేపారు. చైనాలోని పేరెంట్స్ తమ పిల్లల తలలు గుండ్రంగా ఉండేలా హెల్మెట్స్ వంటి హెడ్-షేప్ కరెక్షన్ ప్రొడక్ట్స్ ధరించేలా చేస్తున్నారు.

గుండ్రని తలలు చాలా అందంగా ఉంటాయని చైనీయులు భావిస్తారు. అలాంటి వారిని చూసి ముచ్చటపడటం వరకు బాగానే ఉంది. కానీ తమ బిడ్డకు ‘రౌండ్ హెడ్’ ఉండాలనే ఆశతో తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారు. పసిపిల్లలు మృదువైన ఎముకలను కలిగి ఉన్నందున.. పేరెంట్స్ వారి తలను గుండ్రంగా మార్చేందుకు హెల్మెట్స్, దిండ్లు వంటి హెడ్-షేప్ కరెక్షన్ ప్రొడక్ట్స్‌ ఉపయోగిస్తున్నారని చైనా పత్రికలు నివేదించాయి. ఈ ట్రెండ్‌ను పసిగట్టిన చైనీస్ కంపెనీలు భిన్నరకాల మోడల్స్‌తో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రకాల హెల్మెట్స్ ధరలు ఏకంగా మూడు లక్షలు పలుకుతుండటం గమనార్హం.

చాలా మంది చైనీస్ తల్లులు తమ కుమార్తెల కోసం ఇలాంటి పరికరాలను కొనుగోలు చేస్తున్నారని నివేదిక సూచిస్తోంది. ఎందుకంటే మహిళలు పర్‌ఫెక్ట్‌గా కనిపించాలని ప్రపంచమంతా విశ్వసిస్తుంది. ఏదేమైనా ఈ భావన తప్పుగా కనిపించొచ్చు కానీ చైనీయులు పరిపూర్ణత పట్ల ఎంత వ్యామోహాన్ని కలిగి ఉన్నారో ఇది స్పష్టం చేస్తుంది.

Tags:    

Similar News