మార్స్‌పై చైనా తొలి రోవర్

దిశ, ఫీచర్స్ : ‘అంగారక గ్రహం’పై ఏముందో తెలుసుకోవడానికి చాలా దేశాలు తమ, తమ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా అంతరిక్ష నౌక ‘జురాంగ్’ అంగారక గ్రహంపై విజయవంతంగా, సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా శనివారం ప్రకటించింది. పారాచూట్, రాకెట్ ప్లాట్‌ఫార్మ్ సహాయంతో ఈ రోవర్ మార్స్‌పై దిగింది. అయితే ఇప్పటివరకు అమెరికన్లు మాత్రమే అంగారక గ్రహంపై స్పేస్‌క్రాఫ్ట్‌ను దించగలిగారు. ఇతర దేశాలు ప్రయత్నించినప్పటికీ ఏవీ విజయం సాధించలేదు. దాంతో చైనా […]

Update: 2021-05-15 07:47 GMT

దిశ, ఫీచర్స్ : ‘అంగారక గ్రహం’పై ఏముందో తెలుసుకోవడానికి చాలా దేశాలు తమ, తమ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా అంతరిక్ష నౌక ‘జురాంగ్’ అంగారక గ్రహంపై విజయవంతంగా, సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా శనివారం ప్రకటించింది. పారాచూట్, రాకెట్ ప్లాట్‌ఫార్మ్ సహాయంతో ఈ రోవర్ మార్స్‌పై దిగింది. అయితే ఇప్పటివరకు అమెరికన్లు మాత్రమే అంగారక గ్రహంపై స్పేస్‌క్రాఫ్ట్‌ను దించగలిగారు. ఇతర దేశాలు ప్రయత్నించినప్పటికీ ఏవీ విజయం సాధించలేదు. దాంతో చైనా సాధించిన ఈ విజయం అపురూపమైందిగా ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

నాసా ఇటీవల కాలంలో పంపిన పర్సీవెరెన్స్ రోవర్ విజయవంతంగా మార్స్‌పై దిగి, పరిశోధనలు సాగిస్తోంది. తాజాగా చైనా ‘జురాంగ్’ కూడా అంగారకుడిపై కాలు మోపింది. ఇది మార్స్ ఉత్తరార్ధగోళంలోని విస్తారమైన భూభాగమైన యుటోపియా ప్లానెటియాను లక్ష్యంగా చేసుకుని పని చేస్తుంది. అంతేకాదు అంగారక గ్రహం మీది శిలలను, మట్టిని కూడా విశ్లేషిస్తుందని శాస్ర్తవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ రోవర్ 3 నెలల పాటు అక్కడి భౌగోళిక, వాతావరణ అంశాలను పరిశీలించి సమాచారాన్ని అందిస్తుంది. అది అందించిన సమాచారంతో అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో జురాంగ్‌ను మార్స్ కక్ష ‘టియాన్వెన్-1’లో ప్రవేశపెట్టగా.. అది అప్పటినుంచీ రోవర్ కక్ష్యలో తిరుగుతూ మార్స్‌ను సర్వే చేసింది. రోబో దిగేందుకు అనుకూలమైన ప్రదేశాన్ని అన్వేషించిన, రైట్ ప్లేస్‌ను సెలెక్ట్ చేసింది.

240 కేజీల బరువు ఉండే జురాంగ్‌ సోలార్ ప్యానల్స్ సహాయంతో దానికి కావలసిన శక్తిని గ్రహిస్తుంది. దానికి అమర్చిన కెమెరాల సాయంతో ఫొటోలను చిత్రీకరిస్తుంది. ఇక అక్కడి వాతావరణ స్వభావాన్ని, పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఐదు అదనపు సాధనాలను అమర్చారు. అక్కడి ఉపరితలం అడుగున ఉండే నీటిని లేదా మంచును గుర్తించేందుకు ఒక రాడార్ ఉంటుంది. ఇక చైనీయులు పవిత్రంగా ఆరాధించే అగ్నిదేవుడు ‘జురాంగ్’ పేరుమీదనే దీనికా పేరు పెట్టారు.

మార్స్ మీద తమ రోవర్ అడుగుపెట్టడం నిజంగా ఓ అద్భుతమని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అభివర్ణించింది. అంగారక గ్రహం గురించి అవగాహన పెంచే రీతిలో ఈ మిషన్ అందించే సమాచారం కోసం అంతర్జాతీయ సైన్స్ సమాజంతో పాటూ నేను కూడా ఎదురుచూస్తున్నానని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సైన్స్ విభాగం అధిపతి థామస్ జుర్బూకెన్ అన్నారు.

photo : jurong rover

Tags:    

Similar News