డిజిటల్ డిఫెండర్స్.. స్మార్ట్ బాడీ గార్డ్స్
దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా బిగ్ షార్ట్స్, సెలెబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ వంటి ప్రముఖ వ్యక్తులకు బాడీగార్డ్స్ అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు మనమంతా డిజిటల్ శకంలో ఉన్నాం. సైబర్ దాడులు, డిజిటల్ అటాక్స్‌కే ఆస్కారం ఎక్కువ. అందరూ మూడో ప్రపంచయుద్ధం గురించి ఆలోచించినా.. బయోవార్ గురించి భయపడ్డారు. ప్రత్యక్ష దాడుల కంటే టెక్నాలజీతో జరిగే దాడులను తట్టుకోవడం, వాటిని నిరోధించడం చాలా చాలా కష్టం. అందుకే చైనా, తియాంజిన్‌లోని ‘గెంఘిస్ సెక్యూరిటీ అకాడమీ’లో సెక్యూరిటీ గార్డ్స్‌కు […]
దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా బిగ్ షార్ట్స్, సెలెబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ వంటి ప్రముఖ వ్యక్తులకు బాడీగార్డ్స్ అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు మనమంతా డిజిటల్ శకంలో ఉన్నాం. సైబర్ దాడులు, డిజిటల్ అటాక్స్‌కే ఆస్కారం ఎక్కువ. అందరూ మూడో ప్రపంచయుద్ధం గురించి ఆలోచించినా.. బయోవార్ గురించి భయపడ్డారు. ప్రత్యక్ష దాడుల కంటే టెక్నాలజీతో జరిగే దాడులను తట్టుకోవడం, వాటిని నిరోధించడం చాలా చాలా కష్టం. అందుకే చైనా, తియాంజిన్‌లోని ‘గెంఘిస్ సెక్యూరిటీ అకాడమీ’లో సెక్యూరిటీ గార్డ్స్‌కు డిజిటల్ డార్క్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ ఇస్తోంది.
వందమందిని కొట్టే పనిలేదు.. గన్స్‌తో ఫైరింగ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్ హ్యాకింగ్‌ను పసిగట్టి, ముఖ్యమైన ఫైల్స్‌ను కాపాడితే చాలు. బాస్‌కు బోలెడంత మేలు జరిగినట్లే. శత్రువులు ఏం చేస్తున్నారో ఓ కన్నేసి ఉంచడం.. నెట్‌వర్క్‌ను భద్రంగా చూసుకోవడం, ముఖ్యమైన డేటా అపహరణకు గురికాకుండా చూసుకోవడం, నెట్‌వర్క్ సెక్యూరిటీ హ్యాక్‌లను తిప్పికొట్టడం.. ఇవే ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్‌కు కావాల్సిన స్కిల్స్. ఒక్కమాటలో చెప్పాలంటే.. బాడీ బిల్డింగ్‌తో పాటు స్మార్ట్ బిల్డింగ్ పెంచుకోవడం అవసరం. అటువంటి వారికి రెడ్ కార్పెట్ పరిచి మరీ.. చైనాలో ఉద్యోగాలు ఇస్తున్నారు. చైనాలో ‘డిజిటల్ డార్క్ ఆర్ట్స్’ ఇప్పుడు బూమింగ్ కోర్స్.
చైనాలోని ‘గెంఘిస్ సెక్యూరిటీ అకాడమీ’.. ప్రస్తుతం అలాంటి స్మార్ట్ సెక్యూరిటీ గార్డ్స్‌ను తయారుచేస్తోంది. బాడీగార్డ్స్‌కు ప్రత్యేక శిక్షణనిచ్చేందుకే ఈ అకాడమీని నెలకొల్పడం విశేషం. ఓ వైపు బాడీబిల్డింగ్ చేయిస్తూ.. భౌతిక దాడులను ఎదుర్కోవడంలో శిక్షణ ఇస్తూనే.. మరోవైపు సైబర్ ముప్పును కూడా సమర్థంగా ఎదుర్కొనేలా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణలో భాగంగా.. విద్యార్థులకు వెపన్స్ ఎలా ఉపయోగించాలో నేర్పిస్తారు. హైస్పీడ్ డ్రైవింగ్ నేర్పించడంతో పాటు డిజిటల్ డిఫెన్స్‌లోనూ విద్యార్థుల స్కిల్స్ పెంచుతారు. ఒక్కమాటలో తేల్చాలంటే.. మిలటరీ శిక్షణ కంటే కఠినంగా ఉంటుంది.
చైనాలో డిజిటల్ డార్క్ ఆర్స్ట్‌లో శిక్షణ పొందినవారికి ఫుల్ డిమాండ్ ఉంది. డిమాండ్‌కు సరిపడా గార్డులు దొరక్క ధనవంతులు ఇబ్బందులు పడుతున్నారు. క్రెడిట్ సూయిస్ 2019 లెక్కల ప్రకారం.. చైనాలో 4.4 మిలియన్ల మంది మిలియనీర్లు ఉన్నారు. అమెరికా కంటే ఇక్కడే ఎక్కువగా ఉన్నారు. అందుకే, ప్రతి ఏడాది గ్రాడ్యుయేట్ చేసిన వేలాది మంది.. ఈ తరహా శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు, నార్మల్ ఆఫీస్ జాబ్‌తో పోలిస్తే.. శాలరీ కూడా రెట్టింపు స్థాయిలో ఉండటం కూడా ఇందుకు కారణం. డిజిటల్ డిఫెన్స్ సెక్యూరిటీ గార్డ్స్‌కు ఏడాదికి 70వేల డాలర్లు (రూ. 51,49,669/-) జీతం వస్తోంది. ఇక ఈ కోర్సు చేయడానికి 3 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అధిక శాతం ఎక్స్ మిలటరీ ఎంప్లాయ్స్ ఇందులో చేరుతుండటం విశేషం.