మెట్రోలాజికల్ శాటిలైట్ లాంచ్ చేసిన చైనా
దిశ, ఫీచర్స్ : వాతావరణ విశ్లేషణతో పాటు పర్యావరణ, విపత్తుల పర్యవేక్షణ రంగాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా చైనా న్యూ జనరేషన్ మెట్రోలాజికల్ శాటిలైట్ ఫెంగ్యాన్ -4B(FY-4B)ను గురువారం లాంచ్ చేసింది. అలాగే సించుయాన్ ప్రావిన్స్‌లోని చాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్-3B రాకెట్ ఈ ఉపగ్రహాన్ని కూడా లాంచ్ చేశారు. చైనా న్యూ జనరేషన్ మెట్రోలాజికల్ శాటిలైట్స్‌లో ఇదే మొదటిది కావడం విశేషం. ఈ FY-4B శాటిలైట్.. చిన్న, మధ్య తరహా విపత్తుల సందర్భంలో […]
దిశ, ఫీచర్స్ : వాతావరణ విశ్లేషణతో పాటు పర్యావరణ, విపత్తుల పర్యవేక్షణ రంగాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా చైనా న్యూ జనరేషన్ మెట్రోలాజికల్ శాటిలైట్ ఫెంగ్యాన్ -4B(FY-4B)ను గురువారం లాంచ్ చేసింది. అలాగే సించుయాన్ ప్రావిన్స్‌లోని చాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్-3B రాకెట్ ఈ ఉపగ్రహాన్ని కూడా లాంచ్ చేశారు. చైనా న్యూ జనరేషన్ మెట్రోలాజికల్ శాటిలైట్స్‌లో ఇదే మొదటిది కావడం విశేషం.
ఈ FY-4B శాటిలైట్.. చిన్న, మధ్య తరహా విపత్తుల సందర్భంలో చైనా చర్యలను, ప్రతిస్పందనా సామర్థ్యాన్ని పటిష్టపరచనుంది. కాగా ఈ ఉపగ్రహం మెట్రోలాజికల్, అగ్రికల్చర్, ఏవియేషన్, మెరైన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్‌తో పాటు వివిధ రంగాల్లోని సెక్యూరిటీ సర్వీసుల సమచారాన్ని అందజేయనుందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(సీఎన్‌ఎస్‌ఏ) వెల్లడించింది. అంతేకాదు వరదలు, శీతల గాలులు, కరువు పరిస్థితులు, ఇసుక తుఫాన్లతో పాటు ఇతరత్రా విపత్తులపై ప్రత్యేక పర్యవేక్షణ, ట్రాకింగ్‌కు ఈ కొత్త నెట్‌వర్క్ ఉపయోగపడుతుందని గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
దీని పర్యవేక్షణ పరిధి ఆసియా, సెంట్రల్ పసిఫిక్ ఓషియన్, భారత సముద్ర ప్రాంతాలకు విస్తరించి ఉండనుంది. అందువల్ల తుఫాన్లు, విపత్తుల సమయంలో వాతావరణ పరిస్థితిపై చైనా ముందస్తు అంచనాలను ఈ నెట్‌వర్క్ బాగా మెరుగుపరుస్తుంది. కాగా, మెజర్‌మెంట్ రిజల్యూషన్‌ను జియో స్టేషనరీ ఆర్బిట్ నుంచి 250 మీటర్లకు పెంచే రాపిడ్ ఇమేజర్‌తో పాటు ఎర్త్ స్కాన్ ఇమేజింగ్‌ను యాక్సిలరేట్ చేసే ఎక్విప్‌మెంట్‌ను ఈ ఉపగ్రహం కలిగి ఉంది.