25వేల మందిని కాల్చిపారేసిన చైనా?.. వీడియో హల్చల్

        కరోనా (కోవిడ్-19).. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న పేరు. ఈ వ్యాధి ఇప్పటికే వందలాది మందిని బలిగొన్నది. వేలమందికి సోకుతున్నది. అయితే, ఈ వ్యాధి ఎంత వేగంగా వ్యాప్తిచెందుతున్నదో రెట్టింపు వేగంతో పుకార్లూ వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్యను చైనా ప్రభుత్వం తప్పుగా చెబుతున్నదనీ, మృతుల సంఖ్య వేలల్లో ఉంటే, అక్కడి ప్రభుత్వం వందల్లో చూపిస్తున్నదనే వార్తలు నిన్నటిదాకా, సామాజిక మాద్యమాల్లో తెగ వైరలయ్యాయి. వీటికి బలాన్ని చేకూర్చేలా […]

Update: 2020-02-13 22:08 GMT

కరోనా (కోవిడ్-19).. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న పేరు. ఈ వ్యాధి ఇప్పటికే వందలాది మందిని బలిగొన్నది. వేలమందికి సోకుతున్నది. అయితే, ఈ వ్యాధి ఎంత వేగంగా వ్యాప్తిచెందుతున్నదో రెట్టింపు వేగంతో పుకార్లూ వ్యాప్తి చెందుతున్నాయి.
ఈ వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్యను చైనా ప్రభుత్వం తప్పుగా చెబుతున్నదనీ, మృతుల సంఖ్య వేలల్లో ఉంటే, అక్కడి ప్రభుత్వం వందల్లో చూపిస్తున్నదనే వార్తలు నిన్నటిదాకా, సామాజిక మాద్యమాల్లో తెగ వైరలయ్యాయి. వీటికి బలాన్ని చేకూర్చేలా చైనాకే చెందిన టెన్సెంట్ అనే సంస్థ.. కరోనా బారిన పడి అక్షరాల 24,589 మంది చనిపోయారని చెప్పి సంచలనానికి తెరలేపింది. వ్యాధి సోకిన వారి సంఖ్యను చైనా భారీగా తగ్గించి చెబుతున్నదని ఆరోపించింది. నిజానికి ఈ వైరస్ 1.54లక్షల మందికి సోకగా, చైనా ప్రభుత్వం మాత్రం 55వేల మందికే సోకిందని తప్పుగా చెబుతున్నదని టెన్సెంట్ వెల్లడించింది. వైరస్ సోకిన వారు ఎంతో మంది సరైన చికిత్సలు అందక ఆస్పత్రుల బయటే ప్రాణాలు కోల్పోతున్నారనీ, ఈ సంఖ్యలను అక్కడి ప్రభుత్వం అధికారిక లెక్కల్లో చేర్చకుండానే దహనం చేస్తున్నట్టు వుహాన్ స్థానిక మీడియా వెల్లడించింది. విదేశీ పత్రికలు సైతం కరోనా మృతుల సంఖ్యపై అనుమానం వ్యక్తం చేశాయి.
ఇదిలా ఉండగా, తాజాగా చైనాకు చెందిన మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ బారిన పడిన వారందరినీ అక్కడి ప్రభుత్వం కాల్చిపారేస్తున్నదనీ, ఇప్పటికే 25వేల మందిని కాల్చిపారేసిందనేది దీని సారాంశం. దీనికి బలం చేకూర్చేలా ఓ వీడియో, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నది. ఆ వీడియోను ఓ సారి గమనించినట్టైతే, ముగ్గురు వ్యక్తులు వైరస్ సోకకుండా ఒంటినిండా ముసుగు ధరించి, చేతిలో తుపాకులు పట్టుకుని వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. కట్ చేస్తే, రక్తం మడుగులో కొన్ని మృతదేహాలు కనిపిస్తున్నాయి. తుపాకుల మోత వినిపిస్తున్నది. ఎవరో భయంతో రోదిస్తున్నారు. తర్వాతి వీడియోలో రక్తం మడుగులో పడివున్న మృతదేహం వద్ద ఒకరు ఏడుస్తున్నారు. అయితే, ఈ వీడియోల్లో కనిపించే వాహనాలపై చైనా అక్షరాలు ఉన్నందువల్ల అది చైనాకు చెందిన వీడియోనే అని స్పష్టమవుతున్నది. కానీ, ఈ వీడియో ఎప్పటిదన్నది తెలియాల్సి ఉంది. కాగా, ఈ వీడియో చూసిన కొందరు.. చైనాప్రభుత్వం.. తన నియంతృత్వ ధోరణితో అత్యంత అమానవీయయంగా, క్రూరంగా ప్రవర్తిస్తున్నదని విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News