‘అఖండ’ మూవీపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్ : బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం అఖండ రికార్డులు బద్దలుకోడుతున్న విషయం తెలిసిందే. అఖండకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. ఇక ఈ సినిమా ప్రపంచ‌వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల పైనే క‌లెక్షన్ చేసిన‌ట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ‘అఖండ’ సినిమాపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన రంగరాజన్ పంతులు ఆసక్తికర […]

Update: 2021-12-16 21:17 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం అఖండ రికార్డులు బద్దలుకోడుతున్న విషయం తెలిసిందే. అఖండకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. ఇక ఈ సినిమా ప్రపంచ‌వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల పైనే క‌లెక్షన్ చేసిన‌ట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ‘అఖండ’ సినిమాపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన రంగరాజన్ పంతులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోయిన వారమే అఖండ సినిమాను చూసినట్టు తెలిపారు. ఈ తరంలో ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో అనే విషయాన్ని.. బోయపాటి ప్రత్యక్షంగా చూపించారని కొనియాడారు. ధర్మాన్ని రక్షించడం కోసం మన అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

‘అహింసా ప్రథమో ధర్మః’ అనే వాక్యాన్ని మనకి వ్యతిరేకంగా ఎలా దుర్వినియోగ పరుస్తున్నారో ఈ సినిమాలో చూపించారని తెలిపారు. ధర్మాన్ని రక్షించడం కోసం మనం ఎంతకైనా తెగించవచ్చు అనే సిద్దాంతాన్ని స్పష్టంగా చూపించినట్టు ప్రశంసించారు. రాజ్యాంగం ఉంది.. అయినా మన ధర్మానికి అన్యాయం జరుగుతోంది. రామరాజ్య స్థాపన జరగాలని అందరి మనసుల్లో కోరిక ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని.. ఇది పాలకులు గుర్తించాలని హెచ్చరించారు.

ఆసియా ఖండంలోనే తొలిసారి భారత్ పండుగకు యునెస్కో గుర్తింపు

Tags:    

Similar News