ముసలమ్మపై కన్నబిడ్డల కర్కశత్వం 

దిశ, వెబ్ డెస్క్: కృష్ణాజిల్లా తిరువూరు మండలం చింతలపాడులో అమానవీయ ఘటన వెలుగు చూసింది. వృద్ధురాలైన కన్నతల్లిని కసాయి బిడ్డలు బస్టాండ్ లో గురువారం అనాధగా వదిలి వెళ్లారు. ఆకలి బాధ ఒకపక్క, వయసు సహకరించక నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమెను గమనించిన చింతలపాడు గ్రామ సచివాలయం సిబ్బంది స్పందించారు. ఆమెకు సహాయం అందించాలని  వైసిపి నాయకుడు, ప్రాథమిక వ్యవసాయ సంఘ అధ్యక్షులు కలకొండ రవికి సమాచారం అందించారు. ఆయన స్పందించి తిరువూరు పట్టణంలో ఐడియాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో […]

Update: 2020-09-03 06:17 GMT

దిశ, వెబ్ డెస్క్: కృష్ణాజిల్లా తిరువూరు మండలం చింతలపాడులో అమానవీయ ఘటన వెలుగు చూసింది. వృద్ధురాలైన కన్నతల్లిని కసాయి బిడ్డలు బస్టాండ్ లో గురువారం అనాధగా వదిలి వెళ్లారు. ఆకలి బాధ ఒకపక్క, వయసు సహకరించక నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమెను గమనించిన చింతలపాడు గ్రామ సచివాలయం సిబ్బంది స్పందించారు.

ఆమెకు సహాయం అందించాలని వైసిపి నాయకుడు, ప్రాథమిక వ్యవసాయ సంఘ అధ్యక్షులు కలకొండ రవికి సమాచారం అందించారు. ఆయన స్పందించి తిరువూరు పట్టణంలో ఐడియాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుపుతున్న సౌరిని సంప్రదించారు.

విసన్నపేటలో ఉన్న వృద్ధాశ్రమంకు తరలించాలానే సూచనల మేరకు.. కలకొండ రవి ఆమెను తన సొంత ఖర్చులతో, తానే స్వయంగా వృద్ధాశ్రమంలో చేర్పించారు. కన్నబిడ్డలు వదిలేసినా కొడుకులా ఆమెకు అండగా నిలబడ్డారని రవిని పలువురు అభినందించారు.

Tags:    

Similar News