నవజాత శిశువుకు ‘శానిటైజర్’గా నామకరణం

దిశ వెబ్ డెస్క్ : యుద్ధ సమయంలో పుట్టినందుకు ‘సమరం’, అప్పట్లో అందర్నీ భయపెట్టిన స్కైలాబ్ వేళలో .. ‘స్కైలాబ్’ పేర్లు పెట్టుకోవడం మనందరికీ తెలుసే. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా.. కరోనా, కోవిడ్, క్వారంటైన్, ఐసోలేషన్ పేర్లే వినిపిస్తున్నాయి. దాంతో చాలామంది తమకు పుట్టిన బిడ్డలకు ఆ పేర్లే పెట్టుకుంటున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ జంట తమకు పుట్టిన బాబుకు శానిటైజర్ గా నామకరణం […]

Update: 2020-04-14 04:31 GMT

దిశ వెబ్ డెస్క్ :
యుద్ధ సమయంలో పుట్టినందుకు ‘సమరం’, అప్పట్లో అందర్నీ భయపెట్టిన స్కైలాబ్ వేళలో .. ‘స్కైలాబ్’ పేర్లు పెట్టుకోవడం మనందరికీ తెలుసే. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా.. కరోనా, కోవిడ్, క్వారంటైన్, ఐసోలేషన్ పేర్లే వినిపిస్తున్నాయి. దాంతో చాలామంది తమకు పుట్టిన బిడ్డలకు ఆ పేర్లే పెట్టుకుంటున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ జంట తమకు పుట్టిన బాబుకు శానిటైజర్ గా నామకరణం చేశాయి.
కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తున్న తరుణంలో.. తమ పిల్లలకు ఆ వైరస్ కు సంబంధించిన పదాలతో పెట్టుకోవడం పరిపాటిగా మారింది. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఒక జంట తమకు జన్మించిన కవలలకు కరోనా, కోవిడ్ అని పేరు పెట్టిన విషయం మనకు తెలిసిందే. అంతకు ముందు ఉత్తర ప్రదేశ్‌లో జన్మించిన పిల్లలకు కరోనా, లాక్‌డౌన్ అని పేరు పెట్టారు. అదే విధంగా కడపలో పుట్టిన కవలలకు కరోనా కుమార్, కరోనా కుమారి అనే పేర్లు పెట్టారు. మరొకరు తమ పాపను ‘జనతా’గా పిలుచుకుంటున్నారు. అయితే.. కరోనాన కట్టడి చేయాలంటే.. చేతులను ‘శానిటైజర్’ తో శుభ్రంగా కడుక్కోవాలని ప్రభుత్వాలతో పాటు, డాక్టర్లు కూడా పదే పదే చెబుతున్నారు. అందువల్ల ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలో గత ఆదివారం పుట్టిన మగ పిల్లాడికి ‘శానిటైసర్‌’ అని పేరు పెట్టుకుంది ఓ జంట.

ఎందుకు పెట్టారంటే :

‘‘ కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు విధిగా ప్రతి ఒక్కరూ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలని ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్‌ చేస్తున్న విజ్ఞప్తితో తాము ప్రేరణ పొంది తమ కుమారుడికి ‘శానిటైజర్‌’ అనే పేరు పెట్టుకున్నాం. తమ చేతులను శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ విధిగా శానిటైజర్ ఉపయోగిస్తున్నారు. దీనివల్లే కరోనా వ్యాప్తి అదుపులో ఉంది ’ అని బాలుడి తండ్రి తెలిపారు.

Tags: corona, covid 19, sanitizer, lockdown, uttar pradesh, Coronavirus

Tags:    

Similar News