చొప్పదండిలో మైనర్ మ్యారేజ్.. పేరెంట్స్‌కు కౌన్సిలింగ్!

దిశ, చొప్పదండి : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ఆర్నకొండ గ్రామంలో బుడిగే జంగాల కాలనీలో మైనర్‌కు పెళ్లి చేస్తున్నారని 1098 కు సమాచారం అందగా.. కౌన్సిలర్ భూమేష్, చొప్పదండి ఎస్ఐ వంశీకృష్ణ, సీడీపీఓ అధికారులు వెంటనే అక్కడకు వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అమ్మాయికి 18 ఏళ్లు పూర్తయ్యాకే వివాహం జరిపించాలని తల్లితండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా 1098 కరీంనగర్ అధికారి పోలవేని భూమేష్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయవద్దని.. ఒక వేళ చేసినట్టు […]

Update: 2021-11-28 09:26 GMT

దిశ, చొప్పదండి : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ఆర్నకొండ గ్రామంలో బుడిగే జంగాల కాలనీలో మైనర్‌కు పెళ్లి చేస్తున్నారని 1098 కు సమాచారం అందగా.. కౌన్సిలర్ భూమేష్, చొప్పదండి ఎస్ఐ వంశీకృష్ణ, సీడీపీఓ అధికారులు వెంటనే అక్కడకు వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అమ్మాయికి 18 ఏళ్లు పూర్తయ్యాకే వివాహం జరిపించాలని తల్లితండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా 1098 కరీంనగర్ అధికారి పోలవేని భూమేష్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయవద్దని.. ఒక వేళ చేసినట్టు సమాచారం తెలిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు ఫోన్ చేయాలని సూచించారు. చిన్నతనంలో బాల్య వివాహాలు చేస్తే శారీరక సమస్యలు వస్తాయని తెలిపారు. కార్యక్రమములో చొప్పదండి ఎస్ఐ వంశీకృష్ణ, సీడీపీఓ, అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News