దళితున్ని సీఎం చేయకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రగతిభవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల ముందు ప్రచారంలో ‘రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విషయాన్ని బీజేపీ నేతలు పదేపదే గుర్తుచేస్తూ విమర్శలు చేస్తుండటంతో దళితున్ని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదో ఈ సందర్భంగా కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని […]

Update: 2021-11-08 05:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రగతిభవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల ముందు ప్రచారంలో ‘రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విషయాన్ని బీజేపీ నేతలు పదేపదే గుర్తుచేస్తూ విమర్శలు చేస్తుండటంతో దళితున్ని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదో ఈ సందర్భంగా కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని అన్నారు.

తామే దళితున్ని ముఖ్యమంత్రి చేయనివ్వలేదని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీయే స్వయంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. దళితున్ని ముఖ్యమంత్రి చేయకపోయినా ప్రజలు నా నిర్ణయాన్ని స్వాగతించారని చెప్పారు. రెండోసారి కూడా టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు అధికారం కట్టబెట్టారు అని అన్నారు. తెలంగాణలో తాను ఏ మూలకు వెళ్లినా ప్రజలు గెలిపించారని వెల్లడించారు. ఎక్స్‌పైర్ అయిన మెడిసిన్ లాగా దళితున్ని సీఎం చేస్తానని చెప్పి చేయలేదని అంటున్నారు, ఆ తర్వాత కూడా ప్రజలు నాకే అధికారం కట్టబెట్టారని గుర్తుచేస్తూ బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు.

నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. త్వరలో 70 వేల ఉద్యోగాలు

Tags:    

Similar News