Christmas: మెదక్ చర్చి నిర్మాణంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రతిష్టాత్మక మెదక్ చర్చి(Medak Church)లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక మెదక్ చర్చి(Medak Church)లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. గతేడాది తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మెదక్ చర్చికి వచ్చాను.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రాబోతోందని ఆరోజే చెప్పానని గుర్తుచేశారు. అనుకున్నట్లే ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మెదక్ జిల్లా ప్రజల సహకారం కావాలని ఆకాంక్షించారు. పదేళ్ల క్రితం కరువు, కాటకాలు నిర్మూలించడానికి మెదక్‌లో చర్చిని నిర్మించారని తెలిపారు.
వందేళ్ల చరిత్ర ఉన్న మెదక్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఎక్కువమంది దళిత క్రైస్తవులే ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పనికి ఆహార పథకానికి మెదక్ చర్చి స్ఫూర్తి అని అన్నారు. వచ్చే ఏడాది మళ్లీ ఈ చర్చికి వస్తా.. మా ప్రజా ప్రభుత్వాన్ని దీవించండని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. అంతకుముందు.. చర్చిలో సీఎం రేవంత్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.