ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆగస్టులో వారందరి అకౌంట్లో డబ్బులు

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రజలకు సీఎం వైఎస్ జగన్ తీపికబురు చెప్పారు. ఆగస్టులో ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలను ప్రకటించారు. ఆగస్టు 10న నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నేతన్న నేస్తం పథకం కింద సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 24 వేలు సాయం అందిస్తోంది. ఇప్పటికే రెండు విడతలుగా సాయం అందించిన ప్రభుత్వం మూడో విడత సాయానికి రెడీ అవుతోంది. అలాగే ఆగస్టు 16న జగనన్న విద్యాకానుక […]

Update: 2021-07-27 07:54 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రజలకు సీఎం వైఎస్ జగన్ తీపికబురు చెప్పారు. ఆగస్టులో ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలను ప్రకటించారు. ఆగస్టు 10న నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నేతన్న నేస్తం పథకం కింద సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 24 వేలు సాయం అందిస్తోంది. ఇప్పటికే రెండు విడతలుగా సాయం అందించిన ప్రభుత్వం మూడో విడత సాయానికి రెడీ అవుతోంది. అలాగే ఆగస్టు 16న జగనన్న విద్యాకానుక అందించనున్నట్టు సీఎం చెప్పారు.

జగనన్న విద్యా కానుక కిట్‌లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలతోపాటు 3 జతల యూనిఫారాలు(క్లాత్‌), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్‌, డిక్షనరీ ఇవ్వనున్నారు. మరోవైపు అగ్రిగోల్డ్ బాధితులకు సైతం తీపికబురు చెప్పారు. రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆగస్టు 24న చెల్లింపులు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్‌ మిల్స్‌కు ఆగస్టు 27న ఇన్సెంటివ్‌లు ఇస్తామని సీఎం వెల్లడించారు.

Tags:    

Similar News