కృష్టా జలాల వివాదం.. సీజేఐ ఎన్వీ రమణ సంచలన నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారం కాస్తా సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నదీ జలాల వివాదంపై బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఇరు రాష్ట్రాలకు సూచించారు. ప్రభుత్వాలతో […]

Update: 2021-08-04 01:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారం కాస్తా సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నదీ జలాల వివాదంపై బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరో ధర్మాసనానికి బదిలీ చేసింది.

సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఇరు రాష్ట్రాలకు సూచించారు. ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తెలపాలని ఆదేశించారు. అయితే.. న్యాయపరంగానే పరిష్కారం కోరుకుంటున్నట్లు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ తెలిపింది.

ఈ నేపథ్యంలో పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తూ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకున్నారు. సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్రం కోరగా జస్టిస్‌ ఎన్వీ రమణ నిరాకరించారు. ఈ పిటిషన్‌పై తాను విచారణ చేపట్టబోనని స్పష్టం చేశారు.

Tags:    

Similar News