సుశాంత్ జ్ఞాపకాల్లో శ్రద్ధాకపూర్..
దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘చిచోరే’ చిత్రం విడుదలై ఆదివారంతో ఏడాది పూర్తి చేసుకుంది. చాలా సినిమాలు అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తాయి. కొన్ని సినిమాలు మాత్రం మనకు జ్ఞాపకాలను అందిస్తాయి, మోటివేట్ చేస్తాయి. మనకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోతాయి. ‘చిచోరే’ కూడా అలాంటి సినిమానే. ఈ సినిమా విడుదలై ఆదివారానికి ఏడాది పూర్తి చేసుకుంది. ఎంతోమంది ఫేవరెట్ సినిమా లిస్టులో ‘చిచోరే’ చేరిపోయింది. అయితే ప్రతి సినిమా సెట్స్‌లో ఎన్నో మరపురాని జ్ఞాపకాలు […]
దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘చిచోరే’ చిత్రం విడుదలై ఆదివారంతో ఏడాది పూర్తి చేసుకుంది. చాలా సినిమాలు అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తాయి. కొన్ని సినిమాలు మాత్రం మనకు జ్ఞాపకాలను అందిస్తాయి, మోటివేట్ చేస్తాయి. మనకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోతాయి. ‘చిచోరే’ కూడా అలాంటి సినిమానే. ఈ సినిమా విడుదలై ఆదివారానికి ఏడాది పూర్తి చేసుకుంది. ఎంతోమంది ఫేవరెట్ సినిమా లిస్టులో ‘చిచోరే’ చేరిపోయింది. అయితే ప్రతి సినిమా సెట్స్‌లో ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి కొన్ని మూమెంట్స్‌ను చిచోరే టీమ్ సోషల్ మీడియాలో పంచుకుంది.
చిచోరే షూటింగ్ స్పాట్‌లో మనస్ఫూర్తిగా, హాయిగా నవ్వుతూ కనిపిస్తున్న సుశాంత్‌ను గుర్తు చేసుకుంటూ.. సుశాంత్ టీమ్ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోను హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ‘ఇన్ లవింగ్ మెమొరీ.. వన్ ఇయర్ ఆఫ్ చిచోరే’ అని శ్రద్ధ ఆ పోస్ట్ మీద రాసుకొచ్చింది. ఇక చిత్ర దర్శకుడు నితేష్ తివారీ.. ‘నువ్వు మా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతావు.. వి మిస్ యూ సుష్’ అంటూ ఓ లవ్ సింబల్, మరో హార్ట్ బ్రేక్ సింబల్ షేర్ చేశాడు. చిచోరే సినిమాను సాజిద్ నడియావాలా ప్రొడ్యూస్ చేశాడు. సాజిద్ భార్య కూడా సుశాంత్‌ను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. ఓ వీడియో కోలాగ్‌ను షేర్ చేస్తూ.. ‘సుశాంత్ సింగ్‌కు అంకితం, నువ్వు ఎప్పటికీ మా హృదయంలో నిలిచి ఉంటావు’ అని వార్దా అభిమానులతో షేర్ చేసుకుంది.