కరోనా కట్టడి వ్యాక్సినేషన్‌తోనే సాధ్యం.. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి
దిశ, రాయలసీమ: కరోనా కట్టడి వ్యాక్సినేషన్‌తోనే సాధ్యమని ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ మేళ విజయవంతంగా నిర్వహించారు. తుమ్మలగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ తిరుపతి గ్రామీణ మండలంలో 7,200 డోసెస్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. 100 శాతం వ్యాక్సినేషన్ చేయించుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. థర్డ్ వేవ్ దృష్ట్యా […]
దిశ, రాయలసీమ: కరోనా కట్టడి వ్యాక్సినేషన్‌తోనే సాధ్యమని ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ మేళ విజయవంతంగా నిర్వహించారు. తుమ్మలగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ తిరుపతి గ్రామీణ మండలంలో 7,200 డోసెస్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. 100 శాతం వ్యాక్సినేషన్ చేయించుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
థర్డ్ వేవ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షించుకోవాలన్నారు. ప్రజలు తప్పక మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.