ప్రశ్నించే గొంతునవుతా

దిశ, తుంగతుర్తి: నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే… చట్ట చట్టసభలో ప్రశ్నించే గొంతుక అవుతానని డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామో నేడు రాష్ట్రంలో అవి నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు […]

Update: 2020-11-08 09:24 GMT

దిశ, తుంగతుర్తి: నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే… చట్ట చట్టసభలో ప్రశ్నించే గొంతుక అవుతానని డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామో నేడు రాష్ట్రంలో అవి నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమస్యలపై ప్రశ్నించే దమ్ము లేదన్నారు. రాష్ట్రంలో నాయకులు మారుతున్నా… అభివృద్ధి మాత్రం జరుగడం లేదని తెలిపారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు నేటివరకూ నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో నాయకుల జీవితాలు బంగారం అవుతున్నాయి గానీ, సామాన్య ప్రజల పరిస్థితి మాత్రం బాగుపడటం లేదన్నారు. తనను గెలిపిస్తే చట్టసభలో నిరుద్యోగుల గొంతుకనై పోరాడుతానని అన్నారు. విద్యను ప్రైవేట్ పరం చేస్తూ… కేసీఆర్ కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటున్నాడని వెల్లడించారు.

Tags:    

Similar News