167 పరుగులకు రైడర్స్ ఆలౌట్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 21 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. తొలిసారి ఓపెనర్‌గా దిగిన రాహుల్ త్రిపాఠి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కండ్ల ముందే వచ్చిన వారు వచ్చినట్టు పెవిలియన్ చేరుతున్నా క్రీజులో బలంగా నిలబడ్డాడు. టాప్ ఆర్డర్‌లో వచ్చిన ఏ ఆటగాడు 20 మించి పరుగులు చేయకుండా ఔట్ అవుతున్నా.. తాను మాత్రం సెంచరీ వైపు దూసుకెళ్లాడు. త్రిపాఠి(81) అద్భుత ఇన్నింగ్స్‌తో కోల్‌కతా స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. కేవలం 51 […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 21 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. తొలిసారి ఓపెనర్‌గా దిగిన రాహుల్ త్రిపాఠి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కండ్ల ముందే వచ్చిన వారు వచ్చినట్టు పెవిలియన్ చేరుతున్నా క్రీజులో బలంగా నిలబడ్డాడు.
టాప్ ఆర్డర్‌లో వచ్చిన ఏ ఆటగాడు 20 మించి పరుగులు చేయకుండా ఔట్ అవుతున్నా.. తాను మాత్రం సెంచరీ వైపు దూసుకెళ్లాడు. త్రిపాఠి(81) అద్భుత ఇన్నింగ్స్‌తో కోల్‌కతా స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి 81 పరుగులు చేసిన త్రిపాఠి ఎట్టకేలకు 17వ ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్‌మెన్లు కూడా చెన్నై బౌలర్లను ఎదుర్కొలేక అన్ని వికెట్లను సమర్పించుకున్నారు. చివరి బంతికి కూడా కోల్‌కతా లాస్ట్ వికెట్ కోల్పోయింది. దీంతో నిర్దిష్ఠ 20 ఓవర్లో 167 పరుగులకు ఆలౌట్ అయింది.
తొలి ఇన్నింగ్స్ సాగిందిలా….
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతాకు రాహుల్ త్రిపాఠి మినహా.. మిగతా బ్యాట్స్‌మెన్లు షాక్ ఇచ్చారు. వచ్చినవారు కాసేపు క్రీజులో నిలబడకుండా పెవిలియన్ బాట పట్టారు. 37 పరుగుల వద్ద యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్(11) శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన నితీష్ రానా ఎంతసేపు క్రీజులో నిలబడలేదు. కర్న్ శర్మ వేసిన బంతికి షాట్ ఆడబోయి రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 70 పరుగుల వద్ద కోల్‌కతా 2 కీలక వికెట్లు కోల్పోయింది.
ఇక అప్పటికే క్రీజులో ఉన్న రాహుల్ త్రిపాఠికి.. మిడిలార్డర్‌లో వచ్చిన సునీల్ నరైన్ (17) ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి కాస్తా ఉత్తేజాన్ని నింపాడు. అయినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. 11వ ఓవర్ చివరి బంతిని కొట్టబోయి డుప్లెసిస్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఇయాన్ మోర్గాన్(7), ఆండ్రూ రస్సెల్(2) పరుగులకే చేతులెత్తేశారు. ఇక అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ త్రిపాఠి తన ఇన్నింగ్స్ కొనసాగించాడు.
తొలి ఓవర్ నుంచి ఏకధాటిగా బ్యాటింగ్ చేసిన రాహుల్ త్రిపాఠి కోల్‌కతా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. మొత్తం 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. ఇక 17వ ఓవర్‌లో బ్రావో వేసిన బంతిని అడ్డుకోబోయే ప్రయత్నంలో బ్యాట్ ఎడ్జ్‌కు బాల్ తగలడంతో వాట్సాన్‌కు క్యాచ్ వెళ్లింది. దీంతో 140 పరుగుల వద్ద కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్ ప్లేయర్స్ చెన్నై బౌలర్ల ధాటికి నిలబడలేకపోయారు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి కోల్‌కతా 167 పరుగులు చేయగలిగింది.
స్కోరు బోర్డు:
Kolkata Knight Riders Innings: రాహుల్ త్రిపాఠి c వాట్సన్ b డీజే బ్రావో 81(51),శుబ్‌మన్ గిల్ c ధోని b శార్దుల్ ఠాకుర్ 11 (12), నితీష్ రానా c రవీంద్ర జడేజా b కర్న్ శర్మ 9(10), సునీల్ నరైన్ c డుప్లెసిస్ b కర్న్ శర్మ17(9), ఇయాన్ మోర్గాన్ c ధోని b శామ్ కుర్రాన్ 7(10), ఆండ్రూ రస్సెల్ c ధోని b శార్దుల్ ఠాకూర్ 2(4), దినేష్ కార్తీక్. c శార్దుల్ ఠాకూర్ b శామ్ కుర్రాన్ 12 (11), ప్యాట్ కమ్మిన్స్ నాటౌట్ 17(9), కమలేష్ నాగర్‌కోటి c డుప్లెసిన్ b డీజే బ్రావో 0(2), శివం మావి c ధోని b డీజే బ్రావో 0(1), వరుణ్ చక్రవర్తి run out (రవీంద్ర జడేజా/ధోని)1(1) (ఎక్స్‌ట్రాలు 10, మొత్తం స్కోరు 167/10
వికెట్ల పతనం 37-1 (శుబ్‌మన్ గిల్, 4.2), 70-2 (నితీష్ రానా, 8.1), 98-3 (సునీల్ నరైన్, 10.6), 114-4 (ఇయాన్ మోర్గాన్, 13.6), 128-5 (ఆండ్రూ రస్సెల్, 15.2), 140-6 (రాహుల్ త్రిపాఠి, 16.5),162-7 (దినేష్ కార్తీక్ , 18.6), 163-8 (కమలేష్ నాగర్ కోటి, 19.2), 166-9 (శివం మావి, 19.5), 167-10 (వరుణ్ చక్రవర్తి, 20).
బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-47-0, శామ్ కుర్రాన్ 4-0-26-2, శార్దుల్ ఠాకూర్ 4-0-28-2,
కర్న్ శర్మ 4-0-25-2, డ్వేయిన్ బ్రావో 4-0-37-3.