గర్జించిన చెన్నై సింహాలు.. తోక ముడిచిన SRH
చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ లక్ష్య ఛేదనలో తడబడింది. CSK బౌలర్లు అద్భుతంగా రాణించడంతో SRH బ్యాట్స్‌మెన్స్ త్వరగా పెవిలియన్ చేరారు. హైదరాబాద్ జట్టులో విలియమ్ సన్ 52(36)తో అద్భుతంగా రాణించగా.. మిగతా వారు క్రీజులో నిలబడలేక పోయారు. చెన్నై సింహాలు గర్జించడంతో సన్ రైజర్స్ ఆటగాళ్లు వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెనుదిరిగారు. దీంతో SRH జట్టు నిర్ణీత ఓవర్లలో 147/8 పరుగులు చేసింది. […]
చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ లక్ష్య ఛేదనలో తడబడింది. CSK బౌలర్లు అద్భుతంగా రాణించడంతో SRH బ్యాట్స్‌మెన్స్ త్వరగా పెవిలియన్ చేరారు. హైదరాబాద్ జట్టులో విలియమ్ సన్ 52(36)తో అద్భుతంగా రాణించగా.. మిగతా వారు క్రీజులో నిలబడలేక పోయారు. చెన్నై సింహాలు గర్జించడంతో సన్ రైజర్స్ ఆటగాళ్లు వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెనుదిరిగారు. దీంతో SRH జట్టు నిర్ణీత ఓవర్లలో 147/8 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లలో బౌలర్లు కట్టుదిట్టం చేయడంతో CSK 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
దిశ, వెబ్‌డెస్క్ :
చెన్నై సూపర్ కింగ్స్ విధించిన లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ జట్టు చతికల పడింది. మొదటి మూడు ఓవర్లలోనే కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో హైదరాబాద్ జట్టు మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిపోయింది. మొదటి పది ఓవర్లలో హైదరాబాద్ జట్టు 63-3 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్, బెయిర్ స్ట్రో, మనిష్ పాండే త్వరగా ఔట్ అవడంతో మిగతా ప్లేయర్స్ పైన భారం పడింది. కొద్దిసేపు విలియమ్ సన్, ప్రియామ్ గార్గ్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.
SRHను విజయతీరాలను చేర్చేందుకు కేన్ విలియమ్ సన్ తన శాయశక్తుల ప్రయత్నించాడు. తన దైన శైలితో అద్భుతంగా రాణించాడు. చెన్నై బౌలర్లు ఒత్తిడి పెంచుతున్నా దానిని తట్టుకుని మరి సులువుగా అర్థశతకం బాదాడు. 117-6 స్కోర్ బోర్డు వద్ద 52(36) పరుగులు సాధించాడు. అందులో 6 ఫోర్లు ఉండగా, సిక్సులు జీరో ఉన్నాయి. అయితే కరన్ శర్మలో బౌలింగ్‌లో భారీ షాట్ కు యత్నించి శార్దూల్ ఠాకూర్‌కు దొరికిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లలో ఎవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. దీంతో చెన్నై జట్టు సులువుగా విజయాన్ని కైవసం చేసుకుంది.
Sunraisers innings ;
డేవిడ్ వార్నర్ 9(13) c అండ్ b సామ్ కరన్, జానీ బెయిర్ స్టో 23(24) b జడేజా, మనీష్ పాండే 4(3) rn బ్రావో, ప్రియామ్ గార్గ్ 16(18) c జడేజా b కరన్ శర్మ, విజయ్ శంకర్ 12(6) c జడేజా b బ్రావో, విలియమ్ సన్ 57(39) c ఠాకూర్ b కరన్ శర్మ, రషీద్ ఖాన్ 14(8) హిట్ వికెట్ b ఠాకూర్, నదీమ్ 5(5) c అండ్ b బ్రావో
ఎక్స్‌ట్రాలు-6… మొత్తం స్కోరు : 147/8
వికెట్ల పతనం: 23-1 (డేవిడ్ వార్నర్- 3.3), 27-2 (మనీష్ పాండే – 4) 59-3 ( జానీ బెయిర్ స్టో- 9.5), 117-5 (విజయ్ శంకర్ -16.4), 126-6 (విలియమ్ సన్-17.2)
బౌలర్లు : దీపక్ చాహర్ 4-0-28-0, సామ్ కరన్ 3-0-18-1, రవీంద్ర జడేజా 3-0-21-1, శార్దుల్ ఠాకూర్ 2-0-10-1 కరన్ శర్మ 4-0-37-2, బ్రావో 3-0-25-2, పీయూష్ చావ్లా 1-0-8-0
Chennai super kings Innings:
డూ ప్లిసీ c బెయిర్ స్ట్రో b సందీప్ శర్మ 0(1), సామ్ కరన్ 31(21) బోల్డ్ b సందీప్ శర్మ, అంబటి రాయుడు 41(34) c వార్నర్ B ఖలీల్ అహ్మద్, ధోని 21(13) c విలియమ్ సన్ b నటరాజన్, బ్రావో b ఖలీల్ అహ్మద్, జడేజా 25(10) నాట్ ఔట్, దీపక్ చాహర్ 2(2) నాట్‌ఔట్
ఎక్స్‌ట్రాలు- 5.. మొత్తం స్కోరు : 167/6
వికెట్ల పతనం: 10-1 (డూప్లిసీ- 2.1,) 35-2 (సామ్‌కరన్ – 4.4) 116-3 ( అంబటి రాయుడు- 15.2), 120-4 (షేన్ వాట్సన్-16.2), 152-5 ( ధోని-18.6), 152-6 (బ్రావో-19.1)
బౌలర్లు : సందీప్ శర్మ 4-0-19-2, ఖలీల్ అహ్మద్ 4-0-45-2, షబాజ్ నదీమ్ 4-0-29-0, టి. నటరాజన్ 4-0-41-2, రషీద్ ఖాన్ 4-0-30-0,