బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్

దిశ, వెబ్‌డెస్క్ : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బ్యాంకు రూల్స్ మారుతున్నాయి. దేశీయ ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల్లో ఒక్కటైన AXIS బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక. సంబంధింత బ్యాంకు చెక్ బుక్ వాడే వారికి సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. చెక్ బుక్ మోసాలను అడ్డుకునేందుకు ఆర్‌బీఐ ఈ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇప్పుడు అన్ని బ్యాంకులు ఈ వ్యవస్థను అనుసరిస్తున్నాయి. అయితే.. AXIS బ్యాంక్‌లో ఒకటో తేదీ నుంచి చెక్ […]

Update: 2021-08-22 23:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బ్యాంకు రూల్స్ మారుతున్నాయి. దేశీయ ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల్లో ఒక్కటైన AXIS బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక. సంబంధింత బ్యాంకు చెక్ బుక్ వాడే వారికి సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. చెక్ బుక్ మోసాలను అడ్డుకునేందుకు ఆర్‌బీఐ ఈ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇప్పుడు అన్ని బ్యాంకులు ఈ వ్యవస్థను అనుసరిస్తున్నాయి.

అయితే.. AXIS బ్యాంక్‌లో ఒకటో తేదీ నుంచి చెక్ క్లియరింగ్ సిస్టమ్ చేంజ్ అవుతోంది. పాజిటివ్ పే వివరాలు అందించకపోతే బ్యాంకు చెక్ వెనక్కి ఇచ్చేస్తారు. ఒకటో తేదీ నుంచి చెక్ క్లియరింగ్‌ తేదీకి ఒక్క రోజు ముందు అయినా సరే.. పాజిటివ్ పే వివరాలు అందించాల్సి ఉంటుంది. లేదంటే చెక్ క్లియర్ కాదు. రూ.5 లక్షలకు లేదా ఆపైన చెక్ లావాదేవీలకు ఇది వర్తిస్తుంది.

అయితే, 2021 జనవరి 1 నుంచే పాజిటివ్ పే సిస్టమ్ అమలులోకి వచ్చింది. దీనిలో భాగంగా సంబంధిత బ్యాంకులో చెక్ ఇచ్చిన వారు కచ్చితంగా బ్యాంక్‌కు ఆ చెక్ వివరాలను(పేరు, అమౌంట్ వంటివి) మరోసారి అందించాల్సి ఉంటుంది. SMS, Net Banking, Mobile Banking ద్వారా ఈ వివరాలు అందించాలి. చెక్‌లోని వివరాలను, మీరు ఇచ్చిన వివరాలను క్రాస్ చెక్ చేసుకొని బ్యాంకు అధికారులు చెక్‌ను క్లియర్ చేస్తారు.

ఒకవేళ మీరు ఇచ్చిన వివరాలు మిస్ మ్యాచ్ అయితే.. ఆ చెక్ పెండింగ్‌లోనే ఉండిపోతుంది. క్లియర్ కాదు. దీంతో సంబంధిత చెక్‌ను వెనక్కి ఇచ్చేస్తారు.

Tags:    

Similar News