ఆ కవలల పేర్లు కోవిడ్.. కరోనా!

రాయిపూర్: కరోనా.. కోవిడ్.. ఈ పేర్లు వింటేనే ప్రపంచమంతా బెంబేలెత్తిపోతున్నది. కానీ, ఆ దంపతులు మాత్రం ఆ పేర్లలోనే ప్రత్యేకతలను వెతుక్కున్నారు. తమకు జన్మించిన కవలలు పాప.. బాబులకు కరోనా.. కోవిడ్ అని పేర్లు పెట్టుకున్నారు. కరోనాను నియంత్రించేందుకు అమలవుతున్న లాక్ డౌన్ కాలంలో గత నెల 27వ తేదీన ఛత్తీస్ గడ్ రాజధాని రాయిపూర్ లో నివసిస్తున్న ఓ జంటకు ఇద్దరు కవలలు జన్మించారు. లాక్ డౌన్ కఠిన నిబంధనలు అమలవుతున్న ఆ సమయంలో డెలివరీ […]

Update: 2020-04-03 03:42 GMT

రాయిపూర్: కరోనా.. కోవిడ్.. ఈ పేర్లు వింటేనే ప్రపంచమంతా బెంబేలెత్తిపోతున్నది. కానీ, ఆ దంపతులు మాత్రం ఆ పేర్లలోనే ప్రత్యేకతలను వెతుక్కున్నారు. తమకు జన్మించిన కవలలు పాప.. బాబులకు కరోనా.. కోవిడ్ అని పేర్లు పెట్టుకున్నారు. కరోనాను నియంత్రించేందుకు అమలవుతున్న లాక్ డౌన్ కాలంలో గత నెల 27వ తేదీన ఛత్తీస్ గడ్ రాజధాని రాయిపూర్ లో నివసిస్తున్న ఓ జంటకు ఇద్దరు కవలలు జన్మించారు. లాక్ డౌన్ కఠిన నిబంధనలు అమలవుతున్న ఆ సమయంలో డెలివరీ కోసం తాము ఎదుర్కొన్న కష్టాలకు గుర్తుగా తమ పిల్లలకు ఆ పేర్లు పెట్టుకున్నట్టు దంపతులు చెప్పారు.

యూపీకి చెందిన ఈ దంపతులు రాయిపూర్ లోని పురాని బస్తిలో నివసిస్తున్నారు. మార్చి 26న ప్రీతి వర్మకు పురిటి నొప్పులు వచ్చాయి. కానీ లాక్ డౌన్ అమల్లో ఉండడంతో హాస్పిటల్ ఎలా వెళ్తామోననే భయం వారిని తొలిచేసింది. అదృష్టవశాత్తు అంబులెన్స్ అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మెమోరియల్ హాస్పిటల్ చేరేవరకు ఎన్నో చోట్లా పోలీసులు అంబులెన్స్ అడ్డగించారు. కానీ, ప్రీతి వర్మ పరిస్థితిని చూసి వదిలిపెట్టారు. అర్ధరాత్రి హాస్పిటల్ చేరుకున్నారు. వైద్యులు ఎంత బిజీగా ఉంటారోనన్న సందేహాలతో సతమతమయ్యారు. కానీ, వైద్యులు అందుబాటులో ఉండడమే కాదు వెంటనే అప్రమత్తమై సానుకూలంగా స్పందించారని దంపతులు తెలిపారు. 27వ తేదీ తెల్లవారుజామున డెలివరీ అయినట్టు ప్రీతి వివరించారు. అయితే ఆ భయాందోళనల మధ్య తమ కుటుంబంలోకి చిరునవ్వులు తీసుకొచ్చిన పిల్లలకు కరోనా, కోవిడ్ పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు.

Tags: Coronavirus, twins, names, covid, corona

Tags:    

Similar News