‘బిగ్‌బాష్ లీగ్ రద్దు చేయండి’
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ ఆస్ట్రేలియా, సెవెన్ వెస్ట్ మీడియా మధ్య వివాదం రోజు రోజుకూ పెరిగిపోతున్నది. తాజాగా బిష్ బాష్ లీగ్ (Bish Bash League) ఈ ఏడాదికి రద్దు చేయాలని బ్రాడ్‌కాస్టర్ సెవెన్ వెస్ట్ మీడియా (Broadcaster Seven West Media) డిమాండ్ చేస్తున్నది. అంతే కాకుండా టీం ఇండియా పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చేయాలని సూచించింది. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనం ప్రకారం.. తాము ప్రతిపాదించిన డిమాండ్లు నెరవేర్చకపోతే బ్రాడ్‌కాస్టింగ్ ఒప్పందాన్ని కూడా రద్దు […]
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ ఆస్ట్రేలియా, సెవెన్ వెస్ట్ మీడియా మధ్య వివాదం రోజు రోజుకూ పెరిగిపోతున్నది. తాజాగా బిష్ బాష్ లీగ్ (Bish Bash League) ఈ ఏడాదికి రద్దు చేయాలని బ్రాడ్‌కాస్టర్ సెవెన్ వెస్ట్ మీడియా (Broadcaster Seven West Media) డిమాండ్ చేస్తున్నది. అంతే కాకుండా టీం ఇండియా పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చేయాలని సూచించింది. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనం ప్రకారం.. తాము ప్రతిపాదించిన డిమాండ్లు నెరవేర్చకపోతే బ్రాడ్‌కాస్టింగ్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటామని సెవెన్ వెస్ట్ మీడియా హెచ్చరించినట్లు పేర్కొంది.
కరోనా నేపథ్యంలో ఖర్చులు పెరిగిపోయి, ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో ఈ ఏడాదికి బిగ్ బాష్ రద్దు చేయాలని, హక్కులకు సంబంధించిన ధరను కూడా తగ్గించాలని, ఇండియా మ్యాచ్‌లను సెలవు రోజుల్లోనే పెట్టాలని డిమాండ్ చేసింది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) ఈ డిమాండ్లను తిరస్కరించింది. సెవెన్ వెస్ట్ మీడియా మంగళవారం లోపు సీఏకు 25 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఒక వేళ బ్రాడ్ కాస్టర్ సదరు ఫీజు చెల్లించకపోతే క్రికెట్ ఆస్ట్రేలియా మరింత ఆర్థిక సంక్షోభంలో పడటం ఖాయం. అదే జరిగితే బిగ్ బాష్ లీగ్, టీం ఇండియా పర్యటనలకు ఆటంకాలు ఏర్పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.