పీపీఏ సీఈఓగా చంద్రశేఖర్ అయ్యర్
దిశ, తెలంగాణ బ్యూరో : గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా ఉన్న జె.చంద్రశేఖర్ అయ్యర్‌ను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ కొనసాగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చేనెల 27 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం కూడా చంద్రశేఖర్అయ్యర్ జీఆర్ఎంబీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2019 అక్టోబర్ 25న గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా చంద్రశేఖర్అయ్యర్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా ఉన్న జె.చంద్రశేఖర్ అయ్యర్‌ను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ కొనసాగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చేనెల 27 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం కూడా చంద్రశేఖర్అయ్యర్ జీఆర్ఎంబీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2019 అక్టోబర్ 25న గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా చంద్రశేఖర్అయ్యర్ నియామకమయ్యారు. జీఆర్ఎంబీ ఛైర్మన్‌తో పాటుగా ఆయన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓగా వ్యవహరించనున్నారు. పూర్తికాలం సీఈఓ నియామకమయ్యేంత వరకు ఆయనే పీపీఏ సీఈఓగా కొనసాగనున్నారు.