కరోనా రెండో దశలో ఉంది: బాబు
దేశం, రాష్ట్రంలో కరోనా రెండో దశలో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని నివాసం నుంచి పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా తొలిదశలో విదేశాల నుంచి వచ్చినవారే కరోనా బాధితులయ్యారని, ఇప్పుడు వారి నుంచి ఇతరులకు కూడా సోకుతోందని వెల్లడించారు. కరోనాను ఎవరూ తేలిగ్గా తీసుకోరాదని, కరోనా వైరస్ కనీవినీ ఎరుగని విపత్తు అని అన్నారు. కరోనా కట్టడికి సత్ఫలితాలను ఇచ్చిన విధానాలపై అధ్యయనం చేసి వాటిని రాష్ట్రంలో […]
దేశం, రాష్ట్రంలో కరోనా రెండో దశలో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని నివాసం నుంచి పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా తొలిదశలో విదేశాల నుంచి వచ్చినవారే కరోనా బాధితులయ్యారని, ఇప్పుడు వారి నుంచి ఇతరులకు కూడా సోకుతోందని వెల్లడించారు. కరోనాను ఎవరూ తేలిగ్గా తీసుకోరాదని, కరోనా వైరస్ కనీవినీ ఎరుగని విపత్తు అని అన్నారు. కరోనా కట్టడికి సత్ఫలితాలను ఇచ్చిన విధానాలపై అధ్యయనం చేసి వాటిని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని ఆయన సూచించారు. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ ను సద్వినియోగం చేసుకుని ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు.
Tags : coronavirus, babu, ap, teleconference,