మహారాష్ట్రతో ఏపీ పోటీ: చంద్రబాబు

దిశ, వెబ్‌‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభణపై చంద్రబాబు స్పందించారు. కరోనా పట్ల ప్రభుత్వం చులకనగా చూడటం వల్లే రాష్ట్రంలో 3 లక్షల కేసులు దాటాయని అన్నారు. కరోనా విషయంలో మహారాష్ట్రతో ఏపీ పోటీ పడుతోందన్నారు. 13 జిల్లాలు ఉన్న మన రాష్ట్రంలో దాదాపు 12 జిల్లాలో 15 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. ఏపీలో ప్రతి 10 లక్షల మందిలో 6,761 మందికి సోకినట్టు గణాంకాలు […]

Update: 2020-08-24 11:58 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభణపై చంద్రబాబు స్పందించారు. కరోనా పట్ల ప్రభుత్వం చులకనగా చూడటం వల్లే రాష్ట్రంలో 3 లక్షల కేసులు దాటాయని అన్నారు. కరోనా విషయంలో మహారాష్ట్రతో ఏపీ పోటీ పడుతోందన్నారు. 13 జిల్లాలు ఉన్న మన రాష్ట్రంలో దాదాపు 12 జిల్లాలో 15 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు.

ఏపీలో ప్రతి 10 లక్షల మందిలో 6,761 మందికి సోకినట్టు గణాంకాలు చెబుతున్నాయని, అయితే జాతీయ సగటు చూస్తే 2600 మందికి సోకిందని దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దేశంలో టాప్-30 కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఏపీలో 9 ఉన్నాయని, టాప్-10లో 3 ఉన్నాయని.. ఇది ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు.

Tags:    

Similar News