'ఏపీ విధ్వంసానికి ఇక్కడే బీజం పడింది'
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి నేడు ఇక్కడే బీజం పడిందని టీడీపీ అదినేత చంద్రబాబునాయుడు గుర్తు చేసుకున్నారు. అమరావతి రీజియన్‌లోని కరకట్టపై టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చి నేటికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రజా వేదికను కూల్చేశారన్నారు. ప్రజావేదిక కూల్చడంతోనే ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసానికి బీజం వేశారని చెప్పారు. ఏడాది పాలనలో రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థను, సంస్థను నాశనం చేశారని ఆయన ఆరోపించిన ఆయన, […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి నేడు ఇక్కడే బీజం పడిందని టీడీపీ అదినేత చంద్రబాబునాయుడు గుర్తు చేసుకున్నారు. అమరావతి రీజియన్‌లోని కరకట్టపై టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చి నేటికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రజా వేదికను కూల్చేశారన్నారు. ప్రజావేదిక కూల్చడంతోనే ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసానికి బీజం వేశారని చెప్పారు. ఏడాది పాలనలో రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థను, సంస్థను నాశనం చేశారని ఆయన ఆరోపించిన ఆయన, జగన్ పాలనకు ఇదే గీటురాయని అన్నారు.