వారిని చట్ట సభలకు పంపే బాధ్యత నాదే.. చంద్రబాబు

దిశ, ఏపీ బ్యూరో: ‘రాజ్యాంగం ఇంకా బతికే ఉంది. తప్పును ప్రశ్నించే హక్కు అందరికి ఉంది. చట్ట సభలకు దివ్యాంగులను పంపే బాధ్యత నేను తీసుకుంటా. దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ‘ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి దివ్యాంగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు […]

Update: 2021-12-03 06:33 GMT

దిశ, ఏపీ బ్యూరో: ‘రాజ్యాంగం ఇంకా బతికే ఉంది. తప్పును ప్రశ్నించే హక్కు అందరికి ఉంది. చట్ట సభలకు దివ్యాంగులను పంపే బాధ్యత నేను తీసుకుంటా. దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ‘ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి దివ్యాంగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దివ్యాంగుడైన కోటేశ్వరరావు ఎన్టీఆర్‌కు, తనకు పైలట్‌గా ఉండేవారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ కట్టించిన ఇంటికి ఇప్పుడు పట్టా ఇవ్వడమేంటి..

1983లో దివంగత ఎన్టీఆర్ పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఎన్టీఆర్ కట్టించిన ఇంటికి ఇప్పుడు జగన్ పట్టా ఇస్తాడంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు, దౌర్జన్యాలు, దారుణాలు తప్ప అభివృద్ధి ఏమీ లేదన్నారు. చివరకు డ్వాక్రా మహిళను సైతం వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అరాచకాలపై కమిషన్ వేస్తామన్నారు. అధికారం ఉంది కదా అని విర్రవీగుతున్న వారిపై.. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వంలా మారిందన్నారు. అనేక రకాల పన్నులతో రాక్షసజాతిలా ప్రజలను పీల్చుకు తింటుందని ధ్వజమెత్తారు. ప్రజలను నవరత్నాల పేరుతో నమ్మించి ఇప్పుడు నవగ్రహాల చూట్టూ తిరిగేలా చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చట్ట సభలకు పంపే బాధ్యత నాదే..

‘విభిన్న ప్రతిభావంతులకు టీడీపీ ఎప్పుడూ మంచి చేయాలనే పరితపించేది. దివ్యాంగుడైన కోటేశ్వరరావు.. గతంలో ఎన్టీఆర్‌కు ఆ తర్వాత నాకు పైలైట్‌గా ఉండేవారు. ప్రతీ టూర్‌లో నాకంటే ముందుగా కోటేశ్వరరావు వెళ్లేవారు. అంతేకాదు విభిన్న ప్రతిభావంతులకు రూ.500 ఉండే పెన్షన్‌ను 3 వేలుకు పెంచాం. దివ్యాంగుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి లక్షల మందికి సాయం చేశాం. చట్ట సభలకు దివ్యాంగులను పంపే బాధ్యత నేను తీసుకుంటా.! దివ్యాగులకు రిజర్వేషన్‌లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News