జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది : చంద్రబాబు
మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడిని, టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన విషయంలో అవినీతి చేశారని శుక్రవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాడు. అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలపై నిరంతరం పోరాడుతూ, ఎప్పటికప్పుడు బయటపెడుతున్నందుకే జగన్ ప్రభుత్వం ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. […]
మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడిని, టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన విషయంలో అవినీతి చేశారని శుక్రవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాడు. అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలపై నిరంతరం పోరాడుతూ, ఎప్పటికప్పుడు బయటపెడుతున్నందుకే జగన్ ప్రభుత్వం ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఉన్మాదం, పిచ్చి పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దీనికి సీఎం జగన్, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అరెస్టుకు నిరసనగా ప్రజలు నిరసనలు తెలియజేయాలని, మహాత్ముల విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.