అందులో రెండోస్థానానికి చేరడం శోచనీయం : చంద్రబాబు

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా విస్తృత వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్ విధించడంతో రాష్ట్రంలోని వలస కూలీలు ఉపాధి కోల్పోయి, దర్భర జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ముఖ్యంగా చేతివృత్తుల వారు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఆర్థికసాయం అందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంతేగాకుండా ప్రభుత్వం కరోనాను కట్టడిచేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని, కరోనా రికవరీ రేటులో రాష్ట్రం అట్టడుగున […]

Update: 2020-07-14 03:58 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా విస్తృత వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్ విధించడంతో రాష్ట్రంలోని వలస కూలీలు ఉపాధి కోల్పోయి, దర్భర జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ముఖ్యంగా చేతివృత్తుల వారు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఆర్థికసాయం అందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంతేగాకుండా ప్రభుత్వం కరోనాను కట్టడిచేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని, కరోనా రికవరీ రేటులో రాష్ట్రం అట్టడుగున ఉండటం బాధాకరం అన్నారు. కాగా మరణాల రేటులో రెండోస్థానానికి చేరడం శోచనీయం అన్నారు. ఈ విషయంపై రాష్ట్రంలో వచ్చేవారం నుంచి టీడీపీ వర్చువల్ ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News