'పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యానికి చంద్రబాబే కారణం'
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం కావడానికి చంద్రబాబు, ఆయన తనయుడే కారణమని నేషనల్ లోకల్ గవర్నమెంట్స్ చాంబర్ జాతీయ ప్రధాన కార్యదర్శి జీ.వీరభద్రాచారి విమర్శించారు. గురువారం ఒంగోలులోని సంఘ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయ స్వార్థంతోనే 2018లో ఎన్నికలు నిర్వహించ లేదని చెప్పారు. నేటి ఈ దుస్థికి కారణం వారిద్దరేనన్నారు. నేడు తగుదునమ్మా అని ఎన్నికలు నిర్వహించాలని గగ్గోలు పెట్టడమేమిటని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం కావడానికి చంద్రబాబు, ఆయన తనయుడే కారణమని నేషనల్ లోకల్ గవర్నమెంట్స్ చాంబర్ జాతీయ ప్రధాన కార్యదర్శి జీ.వీరభద్రాచారి విమర్శించారు. గురువారం ఒంగోలులోని సంఘ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయ స్వార్థంతోనే 2018లో ఎన్నికలు నిర్వహించ లేదని చెప్పారు. నేటి ఈ దుస్థికి కారణం వారిద్దరేనన్నారు.
నేడు తగుదునమ్మా అని ఎన్నికలు నిర్వహించాలని గగ్గోలు పెట్టడమేమిటని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా అమలు చేయకుండా నేడు కోర్టు తీర్పులు గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కరోనాకు ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తే ఎన్నికల నిర్వహణ సాధ్యమేనని తెలిపారు. ప్రత్యేక పాలనలో గ్రామాలు అల్లాడుతున్నాయని, పాలకవర్గాల ఏర్పాటుతో వలంటీరు వ్యవస్థ మరింత విజయవంతంగా పనిచేసే అవకాశం ఉందని వీరభద్రాచారి పేర్కొన్నారు.