AP Assembly : చంద్రబాబు ఓ రాజకీయ వ్యభిచారి: మంత్రి కొడాలి నాని
దిశ, ఏపీ బ్యూరో: అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మంత్రుల వ్యాఖ్యలతో మనస్థాపం చెందిన చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీకి వస్తానంటూ శపథం చేసి మరీ వెళ్లిపోయారు. చంద్రబాబు వెంట టీడీపీ ఎమ్మెల్యేలు సైతం బయటకు వచ్చేశారు. అయినప్పటికీ మంత్రి కొడాలి నాని… చంద్రబాబు నాయుడును వదల్లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ సభలోకి అడుగుపెట్టనని […]
దిశ, ఏపీ బ్యూరో: అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మంత్రుల వ్యాఖ్యలతో మనస్థాపం చెందిన చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీకి వస్తానంటూ శపథం చేసి మరీ వెళ్లిపోయారు. చంద్రబాబు వెంట టీడీపీ ఎమ్మెల్యేలు సైతం బయటకు వచ్చేశారు. అయినప్పటికీ మంత్రి కొడాలి నాని… చంద్రబాబు నాయుడును వదల్లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ సభలోకి అడుగుపెట్టనని చెప్పడం ఒక డ్రామా అంటూ ఎద్దేవా చేశారు. సానుభూతి కోసం చంద్రబాబు ఎంతటికైనా దిగజారుతారంటూ సెటైర్లు వేశారు.
సభలో కుటుంబ సభ్యుల ప్రస్తావన తేకపోయినా, తన భార్య పేరును ప్రస్తావించినట్లు చంద్రబాబు అసత్యాలు చెప్తున్నారంటూ విరుచుకుపడ్డారు. సానుభూతి పొందేందుకే.. చంద్రబాబుకు కొన్ని మీడియా సంస్థలు సహకరిస్తున్నాయంటూ కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు ఒక పథకం ప్రకారం ఈ డ్రామాలు ఆడుతున్నారని.. ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి ప్రజల వద్ద సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. నిన్ననే ఈ మంగమ్మ శపథం స్క్రిప్ట్ తయారైందని తనకు తెలుసునంటూ పేర్కొన్నారు. చంద్రబాబు పచ్చి వ్యభిచారిలా వ్యవహరిస్తారని, ఎవరినైనా వాడుకుంటారని… బాధపడుతున్నట్లు నటిస్తున్నారే తప్ప అందులో వాస్తవం లేదని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని మంత్రి కొడాలి నాని అన్నారు.