చేతగాని పాలనకు సాక్ష్యమిదే : చంద్రబాబు

దిశ, ఏపీ బ్యూరో: కడప, చిత్తూరు జిల్లాల్లోని బుగ్గవంక, పించా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టుల కింద పంటలు దెబ్బతినడానికి వైసీపీ చేతగాని పాలనే కారణమని, దానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అధినేత మండిపడ్డారు. శనివారం ఆయన ముంపు జిల్లాల్లోని పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్​నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నివర్ తుపాన్ బీభత్సం వల్ల 114 నియోజకవర్గాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంటనష్టం, ఆస్తి నష్టాన్ని డిజిటల్ రికార్డు కింద నమోదు చేయాలని సూచించారు. […]

Update: 2020-11-28 11:16 GMT

దిశ, ఏపీ బ్యూరో: కడప, చిత్తూరు జిల్లాల్లోని బుగ్గవంక, పించా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టుల కింద పంటలు దెబ్బతినడానికి వైసీపీ చేతగాని పాలనే కారణమని, దానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అధినేత మండిపడ్డారు. శనివారం ఆయన ముంపు జిల్లాల్లోని పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్​నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నివర్ తుపాన్ బీభత్సం వల్ల 114 నియోజకవర్గాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంటనష్టం, ఆస్తి నష్టాన్ని డిజిటల్ రికార్డు కింద నమోదు చేయాలని సూచించారు. ప్రతి రైతు తనకు జరిగిన పంటనష్టంపై వీడియోలో వెల్లడించాలన్నారు. వాట్సాప్‌ ద్వారా 7557557744 నంబర్‌కు వీడియోలు, ఫొటోలు పంపాలని సూచించారు. విపత్తు బాధితులకు సోషల్ మీడియా కార్యకర్తలు అండగా ఉండాలని నిర్దేశించారు.

పూలేకు నివాళి…

మహాత్మా జ్యోతిబాపూలే 130వ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పూలే, మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసమే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నెలకొల్పినట్లు తెలిపారు. రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాములను చేయడం కోసమే 1987 నుంచి 27శాతం, 1995నుంచి 35 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీకి వెన్నెముకగా బీసీలుంటారనే అక్కసుతోనే వైసీపీ వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుంచి మళ్లీ 24 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.

Tags:    

Similar News